icon icon icon
icon icon icon

పింఛన్లను ఒకటో తేదీన ఇంటివద్దే అందించాలి

వృద్ధులు, వికలాంగులు, వితంతు, ఒంటరి మహిళలు, చేనేత కార్మిక, మత్స్యకార, డప్పు కళాకారులకు మే ఒకటో తేదీన, లబ్ధిదారుల ఇంటివద్దే పింఛన్లను అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

Published : 26 Apr 2024 04:36 IST

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వృద్ధులు, వికలాంగులు, వితంతు, ఒంటరి మహిళలు, చేనేత కార్మిక, మత్స్యకార, డప్పు కళాకారులకు మే ఒకటో తేదీన, లబ్ధిదారుల ఇంటివద్దే పింఛన్లను అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వృద్ధులు, వికలాంగులు బయటికి రాలేని పరిస్థితి నెలకొందని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘ సిబ్బందికి ఇతర విధులు అప్పగించకుండా, సరిపడ నగదు ముందుగానే అందేలా చర్యలు తీసుకోవాలి’ అని శ్రీనివాసరావు ప్రకటనలో పేర్కొన్నారు.

సామాజిక భద్రతా పింఛన్‌లను మే 1న ఇంటి వద్దనే ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఇప్పటి నుంచే తగిన చర్యలు చేపట్టి లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని గురువారం ఓ ప్రకటనలో కోరారు. సచివాలయ, రెవెన్యూ సిబ్బందిని ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి వినియోగించాలని సూచించారు.

మేడే నిర్వహణకు సీఈఓ అనుమతి

మేడే రోజు రాష్ట్ర వ్యాప్తంగా జెండాలు ఆవిష్కరించి, ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతివ్వాలని ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు సీపీఎం నేతలు వెంకటేశ్వరరావు, జయరాం గురువారం వినతిపత్రం అందించారు. దీనికి సీఈఓ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుకు లేఖ రాశారు. ‘ఎన్నికల ప్రచారం, ఎన్నికల ఉపన్యాసాలు లేకుండా ప్రదర్శనలు, బహిరంగ సభలు నిర్వహించుకోవచ్చు. వాటికి సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలి’ అని సీఈఓ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img