icon icon icon
icon icon icon

YS Sharmila: వివేకా హత్య.. రూ.40కోట్లు చేతులు మారినట్లు ఆధారాలు: షర్మిల

వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో సాక్ష్యాలు తుడిచేస్తుంటే ఎంపీ అవినాష్‌రెడ్డి ఎందుకు మౌనం వహించారని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు.

Updated : 07 May 2024 13:39 IST

కడప: వివేకా హత్య కేసు (Viveka Murder Case)లో సాక్ష్యాలు తుడిచేస్తుంటే ఎంపీ అవినాష్‌రెడ్డి ఎందుకు మౌనం వహించారని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌ జిల్లా కమలాపురంలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. 

‘‘వివేకా హత్య జరిగిన రోజు ఎవరు చంపారో మాకు కూడా తెలియదు. సీబీఐ సాక్ష్యాలు, ఆధారాలను సేకరించాకే అవినాష్‌ హస్తం ఉందని తెలిసింది. ఆయన ఎవరెవరితో మాట్లాడారో ఫోన్‌ రికార్డులు స్పష్టం చేశాయి. అవినాష్‌ అమాయకుడని సీఎం జగన్, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చెబుతున్నారు. వాళ్లను అమాయకులంటే ఎవరైనా నమ్ముతారా? రూ.40 కోట్లు చేతులు మారినట్లు ఆధారాలున్నాయి. ఇన్ని సాక్ష్యాలున్నా ఐదేళ్లుగా అవినాష్‌పై ఒక్క చేయి కూడా పడలేదెందుకు?సాక్షాత్తూ ముఖ్యమంత్రే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన్ను కాపాడుతున్నారు’’అని షర్మిల ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img