icon icon icon
icon icon icon

ఏపీలో పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియపై పలుచోట్ల ఉద్యోగుల ఆగ్రహం

ఏపీలో పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియలో పలుచోట్ల గందరగోళం నెలకొంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు.

Updated : 07 May 2024 14:46 IST

అమరావతి: ఏపీలో పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియలో పలుచోట్ల గందరగోళం నెలకొంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. విధులు నిర్వహించే చోట ఓటు లేదని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత నియోజకవర్గాలకు వెళ్లి వేయాలని చెప్పడంపై మండిపడుతున్నారు. దీనికోసం ఫాం-12 దరఖాస్తు చేసినా ఉపయోగమేంటని నిలదీస్తున్నారు. గుంటూరులో పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. నగరంలోని లయోలా పబ్లిక్‌ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం వద్ద పలువురి పేర్లు ఓటర్ల జాబితాలో గల్లంతయ్యాయి. ఉన్నతాధికారుల తీరుపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే అవకాశం రాలేదని కాకినాడ జిల్లాలో పలువురు మండిపడ్డారు. సుమారు 200 మందికి అవకాశం రాలేదంటూ ఉద్యోగులు నిరసన చేపట్టారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో సుమారు 30 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోలేకపోయారు. దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్‌ స్పందిస్తూ ఉద్యోగులు తమ ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img