icon icon icon
icon icon icon

పోస్టల్‌ బ్యాలట్‌కు బదులు ఈవీఎంపై సీఈవోకు తెదేపా నేతల ఫిర్యాదు

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పోస్టల్‌ బ్యాలట్‌ పేపర్లు ఇవ్వాల్సింది పోయి తహసీల్దార్‌ ఏకంగా ఈవీఎంను ఉపయోగించారని సీఈవో ముకేశ్‌కుమార్‌మీనాకు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు.

Published : 07 May 2024 06:00 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పోస్టల్‌ బ్యాలట్‌ పేపర్లు ఇవ్వాల్సింది పోయి తహసీల్దార్‌ ఏకంగా ఈవీఎంను ఉపయోగించారని సీఈవో ముకేశ్‌కుమార్‌మీనాకు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. కొందరు అధికారులు కావాలనే కుట్రలు చేస్తూ.. వైకాపాకు మేలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సీఈవోకు సోమవారం తెదేపా నేతలు వర్ల రామయ్య, బుచ్చిరాంప్రసాద్‌, మన్నవ సుబ్బారావు, ఏఎస్‌ రామకృష్ణ తదితరులు ఫిర్యాదు చేశారు. ఈ ఓట్లు అనర్హం కాకుండా చూడాలని ఆయన్ను కోరారు. తమిళనాడులో చదువుతున్న 30 వేల మంది ఏపీ విద్యార్థులు ఈ నెల 13న ఇక్కడికొచ్చి ఓటేసేందుకు వీలుగా అక్కడి వివిధ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు పరీక్షలను రీషెడ్యూల్‌ చేయించేలా చూడాలని సీఈవోకు విన్నవించారు. వీరంతా మొదటిసారి తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నవారేనని తెలిపారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని నూతన డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img