icon icon icon
icon icon icon

కూటమికే కాపుల మద్దతు

ఎన్నికల్లో కాపుల మద్దతు తెదేపా, భాజపా, జనసేన కూటమికేనని కాపు సంఘం నేత వాసిరెడ్డి ఏసుదాసు స్పష్టం చేశారు. రాజకీయంగా, ఆర్థికంగా కాపులకు న్యాయం చేసింది తెదేపా అధినేత చంద్రబాబు అని గుర్తుచేశారు.

Published : 07 May 2024 05:17 IST

ఆ సంఘ నేతల స్పష్టీకరణ

గుంటూరు, మంగళగిరి, పెనమలూరు, న్యూస్‌టుడే: ఎన్నికల్లో కాపుల మద్దతు తెదేపా, భాజపా, జనసేన కూటమికేనని కాపు సంఘం నేత వాసిరెడ్డి ఏసుదాసు స్పష్టం చేశారు. రాజకీయంగా, ఆర్థికంగా కాపులకు న్యాయం చేసింది తెదేపా అధినేత చంద్రబాబు అని గుర్తుచేశారు. ముద్రగడ పద్మనాభం కాపులకు వెన్నుపోటు పొడిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు, మంగళగిరి, పోరంకిల్లో సోమవారం సంఘ నేతలు విలేకర్లతో మాట్లాడారు. కాపు, బలిజ, ఒంటరిలకు చంద్రబాబు 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తే.. వాటిని సీఎం జగన్‌ రద్దు చేశారని మండిపడ్డారు. కాపులు వైకాపాకు ఓటు వేయొద్దని ఆయన పిలుపునిచ్చారు. ‘కాపు నేస్తం’ పథకానికి 65 లక్షల మంది అర్హులుంటే.. కేవలం 2.35 లక్షల మందికే వర్తింపజేయడం దారుణమని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగాల్లోనూ 30 వేల మంది కాపు యువతకు జగన్‌ అన్యాయం చేశారని ఆరోపించారు. చంద్రబాబు కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రూ.3,500 కోట్లు అందించారని, వందల మంది కాపు విద్యార్థులకు విదేశీ విద్యను సాకారం చేశారని వివరించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా ప్రజల భూములను కబ్జా చేసేందుకు జగన్‌ ప్రణాళికలు రూపొందించుకున్నారని, పొలాల్లో సరిహద్దు రాళ్లపై ఉన్న ఆయన చిత్రాలపై ఈ నెల 13న నల్లరంగు వేయాలని పిలుపునిచ్చారు. గత అయిదేళ్ల వైకాపా పాలనలో కాపులకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదని కాపు సంఘం నేత ఆరేటి ప్రకాశ్‌ విమర్శించారు. ఏటా రూ.2 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులు అని చెప్పి.. కాపు కార్పొరేషన్‌ ద్వారా ఎంత ఖర్చు చేశారో సీఎం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img