icon icon icon
icon icon icon

ఓటరు సమాచార చీటీలో స్వల్ప మార్పు

గతంలో ఓటరు సమాచార చీటీపై సంబంధిత వ్యక్తి ఫొటోతో పాటు అతని వివరాలు ఉండేవి. సంస్కరణలలో భాగంగా ఈ సారి ఎన్నికల సంఘం వాటిలో ఓ మార్పు చేసింది. ఫొటోను తొలగించి, ఆ స్థానంలో క్యూఆర్‌ కోడ్‌ పొందుపర్చింది. ప్రస్తుతం వాటిని బీఎల్వోలు ఇంటింటికీ పంచుతున్నారు.

Updated : 07 May 2024 06:46 IST

ఫొటో స్థానంలో క్యూఆర్‌ స్కానర్‌

కుక్కునూరు, న్యూస్‌టుడే: గతంలో ఓటరు సమాచార చీటీపై సంబంధిత వ్యక్తి ఫొటోతో పాటు అతని వివరాలు ఉండేవి. సంస్కరణలలో భాగంగా ఈ సారి ఎన్నికల సంఘం వాటిలో ఓ మార్పు చేసింది. ఫొటోను తొలగించి, ఆ స్థానంలో క్యూఆర్‌ కోడ్‌ పొందుపర్చింది. ప్రస్తుతం వాటిని బీఎల్వోలు ఇంటింటికీ పంచుతున్నారు. వోటర్స్‌.ఈసీఐ.ఇన్‌ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి అక్కడున్న క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే.. సదరు ఓటర్‌ పేరు, వివరాలతోపాటు ఎపిక్‌ నెంబర్‌, క్రమసంఖ్య, పోలింగ్‌స్టేషన్‌ తదితర వివరాలు తెలుసుకోవచ్చు. ఓటు వేసే సమయంలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇందులో పొందుపరిచారు.

గుర్తింపుకార్డు తప్పనిసరి: ఈ ఓటరు చీటి కేవలం వివరాల కోసం మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. ఓటేయ్యాలంటే దాంతోపాటు ప్రభుత్వం గుర్తించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img