icon icon icon
icon icon icon

తెదేపా ఎస్సీ నేత ఇంటికి నిప్పు

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో తెదేపా ఎస్సీ నాయకుడు దాసరి రఘు ఇంటికి దుండగులు నిప్పటించారు. దీంతో రేకుల ఇంటిలోని సామగ్రి దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి మంచికల్లులో తెదేపా నేత గోగుల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీలతో సమావేశం నిర్వహించారు.

Published : 07 May 2024 05:15 IST

వైకాపా కార్యకర్తల పనేనని బాధితుడి ఆరోపణ

రెంటచింతల, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో తెదేపా ఎస్సీ నాయకుడు దాసరి రఘు ఇంటికి దుండగులు నిప్పటించారు. దీంతో రేకుల ఇంటిలోని సామగ్రి దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి మంచికల్లులో తెదేపా నేత గోగుల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీలతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి హాజరై అర్ధరాత్రి దాటిన తర్వాత రఘు రాగా.. అప్పటికే ఇంటిని దట్టమైన పొగ చుట్టుముట్టింది. వెంటనే తాళం పగలగొట్టి లోపలకు వెళ్లి గ్యాస్‌ సిలిండర్‌ను బయటకు తేవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రిఫ్రిజిరేటర్‌, కూలర్‌, ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. అతడి భార్య భార్గవి రెండ్రోజుల కిందట పుట్టినిల్లు దుర్గి మండలం అడిగొప్పలకు వెళ్లారు. ఇంట్లో ఒక్కరే ఉంటున్నారు. ఈ క్రమంలో వైకాపా కార్యకర్తలే తన ఇంటికి నిప్పు పెట్టారని బాధితుడు ఆరోపించారు. తెదేపా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న తనపై వైకాపా కార్యకర్తలు కక్ష కట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img