icon icon icon
icon icon icon

వైకాపా మూకదాడితో విజయవాడ వాసుల బెంబేలు

విజయవాడ విశాలాంధ్రకాలనీలో ఎస్టీ ఉద్యోగి మనోజ్‌కుమార్‌పై వైకాపా మూక దాడికి సంబంధించి ఎన్నికల సంఘం స్పందించింది. పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వేయడానికి వైకాపా ఇచ్చిన డబ్బు తీసుకోలేదని మనోజ్‌కుమార్‌పై ఆదివారం వైకాపా నాయకులు మూకుమ్మడిగా దాడిచేసిన విషయం తెలిసిందే.

Updated : 07 May 2024 09:28 IST

ఎస్టీ ఉద్యోగి మనోజ్‌కుమార్‌ను కొడుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఈసీ అధికారులు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: విజయవాడ విశాలాంధ్రకాలనీలో ఎస్టీ ఉద్యోగి మనోజ్‌కుమార్‌పై వైకాపా మూక దాడికి సంబంధించి ఎన్నికల సంఘం స్పందించింది. పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వేయడానికి వైకాపా ఇచ్చిన డబ్బు తీసుకోలేదని మనోజ్‌కుమార్‌పై ఆదివారం వైకాపా నాయకులు మూకుమ్మడిగా దాడిచేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టి.. నివేదిక ఇవ్వాలని ప్రవర్తన నియమావళి అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌-1 అధికారి ప్రభుదాస్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి డి.మాల్యాద్రి తదితరులు సోమవారం మనోజ్‌కుమార్‌ ఇంటికి వచ్చారు. ఘటన జరిగిన చోటును పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి, వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ‘ఆదివారం మధ్యాహ్నం 30 మంది వైకాపా నాయకులు.. మనోజ్‌కుమార్‌ను, ఆయన భార్య, అన్నను కొడుతున్నారు. పక్కింటిలో ఉన్న మామిడి చెట్టు కిందకు లాక్కుపోయి గొంతు పట్టుకుని మరీ కొట్టారు. చుట్టుపక్కల వాళ్లు వచ్చి రక్షించే ప్రయత్నం చేశారు. వారిని వేరే ఇంటికి పంపిస్తుండగా... వైకాపా నాయకులు వెంటాడి మరీ కొట్టారు. ఈ ఏరియాలో ఎలా తిరుగుతారో చూస్తామంటూ వైకాపా కార్పొరేటర్‌ భర్త గణేష్‌, రవి అనే వారు బెదిరించారు’ అని అధికారులకు స్థానికులు వాంగ్మూలం ఇచ్చారు.ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తామని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img