icon icon icon
icon icon icon

వందేభారత్‌ రైలులో రూ.50 లక్షల స్వాధీనం.. పట్టుబడినవారు వైకాపా అభ్యర్థి అనుచరులు?

ఎలాంటి రశీదులు లేకుండా.. గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌ నుంచి నెల్లూరుకు వందేభారత్‌ రైలులో తరలిస్తున్న రూ.50 లక్షల నగదును ఆర్పీఎఫ్‌ పోలీసులు పట్టుకున్నారు.

Updated : 30 Apr 2024 07:57 IST

పట్టుబడిన వారు వైకాపా అభ్యర్థిమేకపాటి విక్రమ్‌రెడ్డి అనుచరులుగా అనుమానం

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: ఎలాంటి రశీదులు లేకుండా.. గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌ నుంచి నెల్లూరుకు వందేభారత్‌ రైలులో తరలిస్తున్న రూ.50 లక్షల నగదును ఆర్పీఎఫ్‌ పోలీసులు పట్టుకున్నారు. దాన్ని జీఆర్పీఎఫ్‌ పోలీసులకు అప్పగించగా, వారి నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని జీఆర్పీఎఫ్‌ పోలీసులు గోప్యంగా ఉంచడం చర్చనీయాంశమైంది. కుమార్‌, పవన్‌ అనే ఇద్దరు వ్యక్తులు నగదు తరలిస్తున్నారు. వీరిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికాగా, మరొకరు నెల్లూరులో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. వీరిద్దరూ ఆత్మకూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి అనుచరులుగా అనుమానిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img