icon icon icon
icon icon icon

కూటమితోనే దళిత బిడ్డలకు భవిష్యత్తు

కూటమి ప్రభుత్వ ఏర్పాటుతోనే దళిత బిడ్డలకు భవిష్యత్తు ఉంటుందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.

Published : 02 May 2024 06:16 IST

ఆత్మీయ సమావేశంలో మందకృష్ణ మాదిగ

క్రోసూరు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వ ఏర్పాటుతోనే దళిత బిడ్డలకు భవిష్యత్తు ఉంటుందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా క్రోసూరులోని తెదేపా కార్యాలయంలో బుధవారం మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ షెడ్యూల్‌ కులాల వర్గీకరణ జరిగితేనే భవిష్యత్తు ఉంటుందన్నారు. తెదేపా, వైకాపా, భాజపాల నుంచి ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యే, ఎంపీగా పోటీకి తనకు అవకాశం వచ్చినా.. ఉద్యమం నీరుగారిపోతుందనే కారణంతో పదవులు వద్దనుకున్నట్లు తెలిపారు. ఒక్క అవకాశమివ్వండని అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ ఐదేళ్లపాటు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావన్నారు. ఎక్కువగా నష్టపోయిందీ.. ప్రాణాలు కోల్పోయిందీ దళితులేనని అన్నారు. గతంలో తెదేపా అధినేత చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వడం వల్లే 22 వేల మంది దళితులకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. సిద్ధం అంటున్న జగన్‌కు ఏబీసీడీ వర్గీకరణ చేసే దుమ్ముందా అని చంద్రబాబు సవాల్‌ విసిరినా ఆయన స్పందించలేదన్నారు.  ఎస్సీ వర్గీకరణకు ఎన్డీయే కూటమి మద్దతు ప్రకటించిందన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, భాష్యం ప్రవీణ్‌, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్‌మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img