icon icon icon
icon icon icon

ఉద్యోగుల్లో జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నమాట నిజమే

సీఎం జగన్‌ ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమేనని, కొన్ని రాజకీయ పార్టీలు వారిని పక్కదోవ పట్టిస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Published : 02 May 2024 06:24 IST

ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి

కడప నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమేనని, కొన్ని రాజకీయ పార్టీలు వారిని పక్కదోవ పట్టిస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వారికి నిజాలను వివరించడానికి తాము ముందుకు వచ్చామన్నారు. కడపలోని వైకాపా జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో సీపీఎస్‌ రద్దు మినహా మిగతావి 99శాతం నెరవేర్చారన్నారు. గతంలో 27శాతం ఐఆర్‌ ఇవ్వగా వైకాపా ప్రభుత్వం 23శాతం ఇవ్వడంపై మాట్లాడారు. వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు అందించేలా కోరతామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img