Tent boy : టెంటులో నిద్రపోయి రూ.7కోట్లు విరాళం తెచ్చాడు!
బ్రిటన్‌కు చెందిన ఓ బాలుడు మూడేళ్లపాటు ఇంట్లో కాకుండా ఆరుబయట టెంటులో నిద్రించాడు.
(Max Woosey Insta)
ఓ ఆస్పత్రి స్వచ్ఛంద సంస్థకు నిధులు సమకూర్చడం కోసం పదేళ్ల బాలుడు రోజూ ఇంట్లో కాకుండా బయటి ప్రదేశాల్లో టెంటు వేసుకొని మూడేళ్లుగా నిద్రపోయాడు. ఇలా చేయడంతో దాదాపు రూ.ఏడు కోట్ల నిధులు విరాళం(Fund)గా వచ్చాయి. ఆ సంగతేంటో చదివేయండి.
బ్రిటన్(Britain)కు చెందిన పదేళ్ల బాలుడు మ్యాక్స్ వూజీ ఇంటి పక్కనే రిక్ అబాట్ నివసించేవారు. ఆయన మ్యాక్స్ కుటుంబానికి బాగా సన్నిహితుడు. 74ఏళ్ల వయసులో క్యాన్సర్(Cancer)తో చనిపోయారు. అంతకుముందే రిక్ తన దగ్గరున్న టెంట్(Tent)ను మ్యాక్స్‌కు ఇచ్చాడు. దీంతో ఏదైనా సాహస కార్యం చేయమని ఆయన చెప్పిన మాటలు మ్యాక్స్ మెదడులో బలంగా నాటుకుపోయాయి. దాంతో 2020 మార్చిలో తాను ఇంట్లో కాకుండా మూడేళ్లపాటు ఆరుబయట టెంట్లో నిద్రించాలని నిర్ణయం తీసుకున్నట్లు మ్యాక్స్ మీడియాకు తెలిపాడు. ఇలా చేయడం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలనుకున్నట్లు ప్రకటించాడు. అప్పటి నుంచి మ్యాక్స్‌ను ప్రోత్సహిస్తూ పలువురు తనకు విరాళాలు పంపించారు. ఆ మొత్తం ఇప్పుడు దాదాపు రూ.7కోట్లకు చేరింది.
మ్యాక్స్ కృషికి గుర్తింపుగా పలు అవార్డు(Awards)లు కూడా దక్కాయి. బ్రిటిష్ అంపైర్ మెడల్, బేర్‌గ్రిల్స్ చీఫ్ స్కౌట్ అన్సంగ్ హీరో అవార్డు, ఎ ప్రైడ్ ఆఫ్ బ్రిటన్ అవార్డులు అతడిని వరించాయి. మ్యాక్స్ తన మూడేళ్ల టెంట్ నిద్రకు ముగించేముందు ఏప్రిల్ 1న సంబరాలు చేయబోతున్నాడు. ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాడు. ఆ టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన డబ్బును స్వచ్ఛంద సంస్థకు పంపిస్తానని మ్యాక్స్ తెలిపాడు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
MIW vs DCW: ముగిసిన దిల్లీ ఇన్నింగ్స్.. ముంబయి లక్ష్యం 132
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
OneWeb: వన్‌వెబ్ కాన్స్టలేషన్ సంపూర్ణం.. కక్ష్యలోకి 618 ఉపగ్రహాలు
-
Sports News
wWBC: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో లవ్లీనాకు స్వర్ణం
-
Movies News
Smriti Irani: ప్రెగ్నెంట్ అని తెలీదు.. షూట్ వల్ల అబార్షన్ అయ్యింది: స్మృతి ఇరానీ
-
Sports News
Nikhat Zareen: చాలా హ్యాపీగా ఉంది.. తర్వాతి టార్గెట్ అదే: నిఖత్ జరీన్