Bhadradri: కల్యాణోత్సవం లైవ్‌కి అనుమతివ్వండి.. ఈసీకి మంత్రి కొండా సురేఖ లేఖ

భద్రాద్రి సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడంతో మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి మరోసారి లేఖ రాశారు.

Published : 15 Apr 2024 16:23 IST

హైదరాబాద్‌: భద్రాద్రి సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి మూడోసారి లేఖ రాశారు. సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల కోడ్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. 40 ఏళ్లుగా కల్యాణ మహోత్సవం ప్రత్యక్షప్రసారం జరుగుతోందని చెబుతూ.. ఆలయ విశిష్టత, సంప్రదాయాలను లేఖలో వివరించారు. ఈ నెల 17న సీతారాముల కల్యాణం, 18న మహాపట్టాభిషేకం వైభవోపేతంగా నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని