ట్రెండింగ్‌లో ‘రిజైన్‌ జగన్‌’ హ్యాష్‌ట్యాగ్‌

ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో రిజైన్‌ జగన్‌ (#ResignJagan) హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది.

Published : 05 Apr 2024 17:41 IST

అమరావతి: ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో రిజైన్‌ జగన్‌ (#ResignJagan) అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నెటిజన్ల ట్వీట్లతో ఈ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. పింఛన్ల కోసం లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలిసేలా నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఎన్నికల వేళ రాజకీయ ప్రయోజనం కోసం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు పంపిణీ చేయాలనే సామాజిక బాధ్యత విస్మరించిన జగన్‌ తన పదవికి రాజీనామా చేయాలంటూ వందలాది మంది ట్వీట్లు చేస్తున్నారు. ఏపీలో అవ్వాతాతలకు మద్దతుగా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని