RGUKT-Basara: కేసీఆర్‌ లేదా కేటీఆర్‌ రావాల్సిందే..: బాసరలో విద్యార్థుల భారీ నిరసన

నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యాలయంలో నెలకొన్న సమస్యలు, సౌకర్యాల కొరత, సామగ్రి సరఫరాలో యాజమాన్యం

Updated : 15 Jun 2022 15:30 IST

బాసర: నిర్మల్‌ జిల్లా బాసర(Basara) ఆర్జీయూకేటీ(RGUKT)లో విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యాలయంలో నెలకొన్న సమస్యలు, సౌకర్యాల కొరత, సామగ్రి సరఫరాలో యాజమాన్యం నిర్లక్ష్యంపై మంగళవారం నుంచి ఆందోళన చేస్తున్న విద్యార్థులు.. బుధవారం కూడా నిరసన కొనసాగించారు. సుమారు 6వేల మంది విద్యార్థులు మెయిన్‌ గేటు వద్ద బైఠాయించి ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు.  

తెలంగాణ ఆవిర్భావం నుంచి ఆర్జీయూకేటీకి శాశ్వత వీసీ నియామకం జరపకపోవడం, మూడేళ్లుగా ల్యాప్‌టాప్‌ల సరఫరా, యూనిఫాం డ్రెస్సుల పంపిణీ లేకపోవడం, నాణ్యమైన భోజనం పెట్టకపోవడంపై ఆందోళన చేపట్టినట్లు విద్యార్థులు తెలిపారు. విద్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ (CM KCR) లేదా మంత్రి కేటీఆర్‌ (KTR) సందర్శించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అప్పుడే ఆందోళన విరమిస్తామని తేల్చి చెబుతున్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో గేటు వద్దకు చేరుకోవడంతో వారిని నిలువరించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని