Top 10 News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లో ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 29 Feb 2024 09:03 IST

1. నేడే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీకి రంగం సిద్ధమైంది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం తన నివాసంలో విడుదల చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఝార్ఖండూ మనల్ని దాటేసింది!

అపార అవకాశాలుండీ.. విలువైన వనరులుండీ.. పుష్కలమైన మావన వనరులూ ఉండీ.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రావని వెనకబడిపోయింది! ఝార్ఖండ్‌లాంటి రాష్ట్రాలకూ వెళుతున్న పారిశ్రామికవేత్తలు.. మన రాష్ట్రం వైపు మాత్రం చూడటం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. మా పాలనలో ఉద్యోగులు ఇబ్బందిపడిన మాట వాస్తవమే: ఎమ్మెల్యే బాలినేని

అయిదేళ్ల తమ పాలనలో రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందిపడిన మాట వాస్తవమేనని వైకాపా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైకాపాకు రాజీనామా చేశాక ఆయనతో కలిసి బాలినేని ఒంగోలులో ఎన్జీవో భవన్‌ను ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. కొత్త విధానం.. కోత ఖాయం!

ఈపీఎఫ్‌వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు జారీ అవుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. సందేశ్‌ఖాలీ’ నిందితుడు షాజహాన్‌ షేక్‌ అరెస్టు

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై వేధింపులు, భూ ఆక్రమణల్లో ప్రధాన నిందితుడైన షాజహాన్‌ షేక్‌ను అరెస్టు చేసినట్లు రాష్ట్ర పోలీసుల గురువారం ఉదయం ప్రకటించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మినాఖాలోని ఓ ఇంటిలో ఆయన్ను పట్టుకున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఓట్ల దొంగలున్నారు.. జాగ్రత్త!

‘రాష్ట్రంలో ఓట్ల దొంగలున్నారు.. ప్రతి ఒక్కరూ చైతన్యులవాలి. మీరు ఓటేయకపోతే తిరుపతిలో జరిగినట్లు మీ ఓటూ చోరీ అయ్యే ప్రమాదముంది..’ అని రాష్ట్ర పూర్వ ఎన్నికలఅధికారి, సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. మా అనుమతి లేకుండా ఓట్లెలా బదిలీ చేస్తారు?

‘మాకు సమాచారం ఇవ్వకుండా మా ఓట్లు ఎలా బదిలీచేస్తారు? నిర్వాసితుల సమస్యలు పరిష్కరించని అధికారులు.. ఓట్ల తరలింపుపై శ్రద్ధ చూపడంలో మర్మమేంటి?’ అని దేవీపట్నం మండల పోలవరం నిర్వాసితులు నిలదీశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. దిండోరి జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డులు: పొంగులేటి

ఇచ్చిన హామీమేరకు రాష్ట్రంలో అర్హులందరికీ ఇందిరమ్మ గృహాలు, రేషన్‌ కార్డులు త్వరలోనే మంజూరు చేస్తామని, మహిళలకు రూ.2,500 అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. పెను ముప్పుగా మధుమేహ వ్యాధి

అల్జీమర్స్‌, మధుమేహం, ఊబకాయం వ్యాధులకు చికిత్సలో వినియోగించే కొన్ని నూతన ఔషధాలను బహుళ జాతి ఫార్మా కంపెనీ  ఎలీ లిల్లీ త్వరలో మనదేశంలోకి తీసుకురానుంది. బయో ఏషియా 2024 సదస్సుకు బుధవారం హాజరైన ఎలీ లిల్లీ అండ్‌ కంపెనీ సీఈఓ డేవిడ్‌ రిక్స్‌ ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని