Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Apr 2024 09:12 IST

1. హామీల సంగతేంటి జగనన్నా..?

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌ చేసింది. కాగిత రహిత పాలనకు చరమగీతం పాడాలని సిబ్బందికి స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేసింది. అవి కొంతకాలం పని చేసిన తర్వాత తరచూ మొరాయిస్తుండటంతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పోషణ్‌ ట్రాకర్‌, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, తదితర యాప్‌లలో వివిధ వివరాలను పొందుపరుస్తున్నారు. పూర్తి కథనం

2. సందేశ్‌ఖాలీ నిందితుడిపై చర్యలు తీసుకున్నాం: మమత

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, అవినీతికి పాల్పడిన వారు జైలులో శేష జీవితం గడపడం తప్పదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. సందేశ్‌ఖాలీ దోషులపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని స్పష్టంచేశారు.పూర్తి కథనం

3. అధికారం.. అయిదేళ్ల విధ్వంసం!

కొండలను పిండి చేశారు. గుట్టలకు గుండు కొట్టారు. నదుల్లోని ఇసుకను తోడేశారు. అధికారమే అండగా.. గడిచిన అయిదేళ్లలో వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు సహజ వనరులను ఇష్టారీతిన దోచేశారు. మట్టి, ఇసుక, గ్రావెల్‌, భూములు.. దేన్నీ వదలలేదు. రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతూ.. రూ. కోట్లు వెనకేసుకున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతూ.. ప్రజల హక్కులనూ నిర్వీర్యం చేశారు.పూర్తి కథనం

4. పాత సమస్యలకు కోడ్‌ అడ్డు కాదుగా..!

భూ సమస్యల దరఖాస్తులు మళ్లీ పెరుగుతున్నాయి. వానాకాలం లోపు పాసుపుస్తకాలు పొందితేగానీ ప్రభుత్వం అందించే సాయం, ప్రైవేటు రుణాలు పొందడానికి వీలుపడదని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ధరణి పెండింగ్‌ దరఖాస్తులు 2.46 లక్షలకు తోడు మరో 2.5 లక్షల ఇతర సమస్యలు ఉన్నాయి. ధరణి పునర్నిర్మాణ కమిటీ సిఫార్సుల మేరకు కొత్త ప్రభుత్వం.. పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభించింది.పూర్తి కథనం

5. సుద్దులు చెప్పి.. సున్నం కొట్టి..

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి వల్లించిన సుద్దులివి. అసలు అప్పులంటేనే తప్పన్నట్లు... అటువైపే చూడబోమన్నట్లు ధర్మప్రభోదాలు చేశారు. అందరికీ బిల్లులు సక్రమంగా చెల్లించే కట్టుతప్పని కఠిన నిబంధనలు తామేదో అమలు చేస్తామన్నట్లుగా అమాయకపు పోజులు పెట్టారు. సీఎం జగన్‌ నోట్లోంచే ఆ మాటలు జాలువారినట్లుగా ప్రభుత్వం గొప్పలను అందరికీ చెవిలో జోరీగలా వినిపించారు. పూర్తి కథనం

6. వైకాపా ఓటమికి టపాసులు కాలుస్తా: పృథ్వీరాజ్‌

‘నేను జగనన్న వదిలిన బాణాన్ని’ అని గతంలో చెప్పిన వైఎస్‌ షర్మిల.. నేడు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలై ఆయన్నే పొడుస్తున్నారని జనసేన నేత, సినీ నటుడు పృథ్వీరాజ్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో ఆమె కడప లోక్‌సభ స్థానం నుంచి గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే అంబటి రాంబాబుతో సంక్రాంతి పండక్కి డ్యాన్సులు వేయిస్తామని ఎద్దేవా చేశారు.పూర్తి కథనం

7. అధికారులే గుత్తేదారులై

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఖర్చులకు సంబంధించి నిధులు పక్కదారి పట్టాయి. కొందరు అధికారులే గుత్తేదారుల అవతారమెత్తి జేబుల్లో వేసుకున్నారు. వాటినే ఆమోదించిన బిల్లులు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇలా ఖర్చు చేసి.. అలా బిల్లు తీసుకునే పనులను వారే చేపట్టారు. నకిలీ బిల్లులు, బినామీల పేర్లతో రూ.కోట్లు గడించారు.పూర్తి కథనం

8. మట్టిలో కలిసే వరకు కేసీఆర్‌ వెన్నంటే ఉంటా

‘ముప్పై ఏళ్లు పార్టీని నమ్ముకుని ఆ రోజు తెదేపాకి ఒక నిజాయతీ గల నాయకురాలిగా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేశా. ఆ తరువాత కేసీఆర్‌ పిలిచారు.. ఎన్నికల్లో ఓడిపోతే బిడ్డలా ఆదరించి ఎమ్మెల్సీని చేశారు. మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పి గుర్తింపునిచ్చారు. ఆయన మూడోసారి సీఎం కావాలనే ఆకాంక్షతో కాళ్లకు చెప్పులు తొడగకుండా పార్టీ అభివృద్ధి కోసం పని చేశా. పూర్తి కథనం

9. కోడ్‌కు రాంరాం.. వైకాపాకే సలాం!

గన్నవరంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు గమనించిన తెదేపా నాయకురాలు, కడప అభ్యర్థిని మాధవిరెడ్డి చిత్రాలు తీసి.. సీ విజిల్‌ ద్వారా ఫిర్యాదు చేయబోయారు. అంతే... వైకాపా కార్యకర్తలు ఆమె కారును అడ్డుకొని హల్‌చల్‌ చేశారు. పోలీసులు సైతం ఆమెతోనే దురుసుగా ప్రవర్తించి.. కారును కదలనీయలేదు. గన్నవరం సీఐ ఆధ్వర్యంలో ఈ ఘటన జరగ్గా.. వైకాపా కార్యకర్తల తరహాలో పోలీసులు వ్యవహరించారు.పూర్తి కథనం

10. నేతన్నలకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం

చేనేత కార్మికులకు గత భారాస ప్రభుత్వ హయాంలో తీవ్ర అన్యాయం జరిగిందని, నాటి కేసీఆర్‌ ప్రభుత్వం వారిపై కక్ష గట్టి రోడ్డున పడేసిందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నేతన్నలకు చేతినిండా ఆర్డర్లు ఇస్తూ బకాయిలను చెల్లిస్తూ వారికి అండగా నిలుస్తోందని అన్నారు. శుక్రవారం తుమ్మల తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని