icon icon icon
icon icon icon

YS Sharmila: నవ సందేహాలు.. సమాధానం చెప్పు జగన్‌: షర్మిల బహిరంగ లేఖ

సీఎం జగన్‌కు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని అందులో కోరారు.

Updated : 01 May 2024 12:04 IST

అమరావతి: సీఎం జగన్‌కు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని కోరారు. ‘‘ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధుల దారి మళ్లింపు వాస్తవం కాదా? సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? 28 పథకాలను అర్ధంతరంగా ఎందుకు ఆపేశారు?ఎస్సీ, ఎస్టీలకు పునరావాస కార్యక్రమం ఎందుకు నిలిచిపోయింది? విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్‌ పేరు ఎందుకు తీసేశారు? ఎస్సీ, ఎస్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారు? ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి.. ఇది మీ వివక్ష కాదా? డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు? స్టడీ సర్కిళ్లకు నిధులివ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు?’’ అని షర్మిల లేఖలో ప్రశ్నించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img