Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 08 Apr 2024 12:59 IST

1. వివేకా హత్య కేసు.. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సునీత

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో ఆయన కుమార్తె సునీత (Suneetha Narreddy) మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. శివశంకర్‌కు తెలంగాణ హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. పూర్తి కథనం

2. సిట్‌ కార్యాలయంలో పత్రాల దహనం.. హెరిటేజ్‌ సంస్థవేనంటూ తెదేపా ఆరోపణ

తాడేపల్లి సిట్‌ కార్యాలయం కాంపౌండ్‌లో పలు పత్రాలను సిబ్బంది దహనం చేశారు. ఇది అనుమానాలకు తావిస్తోంది. వీటిని తగలబెట్టడాన్ని పలువురు స్థానికులు ప్రశ్నించడంతో పాటు వీడియోలు తీశారు. ఆ వీడియోలను తమకు ఇవ్వాలని స్థానికులపై సీఐడీ ఒత్తిడి తెస్తోంది. పూర్తి కథనం

3. దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఆమెకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కవిత పిటిషన్‌ దాఖలు చేశారు.  పూర్తి కథనం

4. విశాఖ రైల్వేస్టేషన్‌లో కుంగిన పాదచారుల వంతెన

విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో సోమవారం ఉదయం పాదచారుల వంతెన కుంగింది. 3, 4 ప్లాట్‌ఫాంల నుంచి వచ్చే ప్రయాణికులు గేట్‌ నంబర్‌ 3 వైపునకు దీని మీదుగానే వెళ్తుంటారు. వంతెన వాడుకలో ఉన్నప్పటికీ కూలిపోయే స్థితికి చేరుకుంది. దీంతో ప్రయాణికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కుంగిన సమయంలో వంతెన తాకడంతో కింద ఉన్న విద్యుత్‌ వైర్లు తెగిపోయాయి. పూర్తి కథనం

5. ‘ఉగ్రవాదులకు బిర్యానీ పెట్టి పోషించారు’: కాంగ్రెస్‌పై యోగి విమర్శలు

ఉగ్ర అనుమానితుల పట్ల కాంగ్రెస్ (Congress) పార్టీ మెతక వైఖరి అనుసరించిందని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ పాలనలో పేదలు ఆకలితో అలమటించారని.. ఉగ్రవాదులకు మాత్రం బిర్యానీ పెట్టి పోషించారని దుయ్యబట్టారు. పూర్తి కథనం

6. నోట్ల గుట్టలు.. బంగారం సంచులు.. ఎన్నికల వేళ భారీగా పట్టివేత

లోక్‌సభ ఎన్నికలు (Lok sabha Elections) సమీపిస్తున్న వేళ కర్ణాటక (Karnataka)లో భారీగా అక్రమ నగదు, బంగారం బయటపడటం తీవ్ర కలకలం రేపింది. బళ్లారి (Bellary)లో ఓ వ్యాపారి ఇంట్లో పోలీసులు సోదాలు జరపగా.. రూ.7.6 కోట్ల నగదు, బంగారు, వెండి ఆభరణాలను గుర్తించారు. పూర్తి కథనం

7. గాల్లోకి ఎగిరాక ఇంజిన్‌ కవర్‌ ఊడిపోయి.. భయపెట్టిన బోయింగ్‌ విమానం

విమానం గాల్లోకి ఎగరగానే దాని ఇంజిన్‌ కవర్‌ ఊడిపోయి ఫ్లాప్స్‌పై చిక్కుకొన్న ఘటన అమెరికాలో చోటు చేసుకొంది. ఈ సారి కూడా బోయింగ్‌ (Boeing) విమానానికే సమస్య ఎదురవడం గమనార్హం. ది సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737-800 విమానం డెనివర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి హ్యూస్టన్‌కు బయల్దేరింది. పూర్తి కథనం

8. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌తో జియో కొత్త ప్లాన్‌

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance Jio) ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా కొత్త ప్లాన్లను తీసుకొస్తుంటుంది. ఇటీవల రూ.857తో మరో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీంట్లో ఓటీటీ ప్రయోజనాలు ఉండడం విశేషం. పూర్తి కథనం

9. ఇది ఆరంభమే.. ఇంకా ముందుంది..: రోహిత్‌ ట్వీట్‌

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ముంబయి ఖాతా తెరిచింది. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. దీనిపై ఆ జట్టు మాజీ కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఎక్స్‌ వేదికగా చేసిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇది ఆరంభం మాత్రమే అన్నట్లు అర్థమొచ్చేలా ఆఫ్‌ది మార్క్‌ అని ట్వీట్‌ చేశాడు. పూర్తి కథనం

10. క్లియర్ మైండ్‌సెట్‌తో ఆడా.. బాగా తినడమే నా రహస్యం: రొమారియో షెఫర్డ్‌

ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబయి విజయాల ఖాతా తెరిచింది. వరుసగా మూడు ఓటముల తర్వాత ఆ జట్టుకిదే తొలి గెలుపు. దిల్లీపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అందుకొన్న రొమారియో షెఫర్డ్ (Romario Shepherd) కేవలం 10 బంతుల్లోనే 39 పరుగులు సాధించాడు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని