Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 01 Dec 2022 08:59 IST

1. సీమంతం కాదు.. ముందు టిఫా

పేట్లబుర్జు ప్రసూతి ఆసుపత్రిలో జనవరి నుంచి ఇప్పటివరకు 30 మంది గర్భిణులకు 5 నెలలు నిండిన తర్వాత గర్భస్రావం చేశారు. పుట్టబోయే శిశువులో అవయవ లోపాలు ఉండటం వల్ల తప్పనిసరి పరిస్థితిలో వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వీళ్లంతా తమకు పుట్టబోయే బిడ్డను తలచుకొని ఆనందంతో సీమంతం వేడుక జరుపుకొనే వారే. తీరా 5 నెలల తర్వాత చేసిన టిఫా స్కానింగ్‌లో... బిడ్డలో లోపాలు బయటపడటంతో గర్భవిచ్ఛిత్తి తప్పనిసరి అవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రయివేటు సంస్థపై.. ఎంత ప్రేమో?

మహా విశాఖ నగరపాలక సంస్థ అధికారులు ప్రయివేటు ఏజెన్సీలపై అవ్యాజ్య ప్రేమను కనబరుస్తున్నారు. ఏజెన్సీ నిర్వాహకులకు కలిసొచ్చేలా నిర్ణయాలు తీసుకుంటూ స్థాయీ సంఘ సమావేశాల్లో ప్రతిపాదనలు పెడుతున్నారు. తాజాగా జీవీఎంసీ పొరుగుసేవల సిబ్బంది పీఎఫ్‌, ఈఎస్‌ఐ నిధుల నిర్వహణ, ఆడిట్‌ చేయడానికి ఏడాదిన్నరకు రూ.39.91 లక్షలు వెచ్చించడానికి సన్నద్ధమవుతున్నారు. దీనినీ స్థాయీ సంఘ అనుమతి నిమిత్తం ప్రతిపాదించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. డామిట్‌.. జూదం కేసు అడ్డం తిరిగింది

అనుకున్నదొక్కటి.. అయినది మరొకటి. రూ.లక్షలపై ఆశతో ఇద్దరు ఎస్‌వోటీ కానిస్టేబుళ్లు నడిపిన చీకటి వ్యవహారం బెడిసికొట్టింది. లక్ష్యం నెరవేరినా.. విషయం ఉన్నతాధికారులకు చేరటంతో వారిద్దరిపై శాఖాపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్ల సరిహద్దుల్లో జరిగిన జూద స్థావరంపై ఆ ఇద్దరు కానిస్టేబుళ్ల దాడి వెనుక దాగిన అసలు నిజం ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తిరుమలలో అభివృద్ధికి భారీగా నిధులు

తిరుమలలో భక్తులకు సౌకర్యాల పెంపుతో పాటు స్థానికుల నివాస ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తితిదే నుంచి భారీగా నిధులు కేటాయించామని ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో తితిదే ఛైర్మన్‌ అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. శ్రీవారి ఆలయానికి అనుబంధంగా చేపట్టే కార్యక్రమాలపై బోర్డుసభ్యులు పలు తీర్మానాలను ఆమోదించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Teenamar Mallana: కేసీఆర్‌ ఎక్కడ పోటీ చేస్తే అక్కడే చేస్తా: తీన్మార్‌ మల్లన్న

తీన్మార్‌ మల్లన్న చేపట్టిన ‘7200 ఉద్యమ పాదయాత్ర’కు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ పాదయాత్రకు అనుమతులు నిరాకరించడంతో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మల్లన్న తెలిపారు. పాదయాత్రలో భాగంగా బుధవారం ఆయన సత్తుపల్లిలోని జేవీఆర్‌, కిష్టారం ఓసీల్లో పర్యటించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Sonu sood: మరోసారి పెద్ద మనసు చాటుకున్న నటుడు సోనూసూద్‌

కరోనా సమయంలో ఎంతో మందికి ఆపన్నహస్తం అందించిన సినీ నటుడు సోనూసూద్‌.. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సారంగి వాయిద్యకారుడికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఓ ట్విటర్‌ యూజర్‌ పెట్టిన పోస్టుకు స్పందించిన సోనూసూద్‌.. సారంగి వాయిద్యకారుడికి సహాయం చేస్తానని తిరిగి రీట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఏమార్చుతూ.. అడ్డదారులు తొక్కుతూ...

నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లిళ్లు కన్నవారికి భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాన్ని అమలుచేస్తోంది. పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ.1,00,116 చొప్పున అందిస్తోంది. లబ్ధిదారుల కుటుంబాల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అధికారుల సహకారంతో కొందరు వక్రమార్గంలో లబ్ధి పొందుతున్నారు. అడ్డదారుల్లో ఆధార్‌లో పుట్టిన తేదీలు మార్చి ప్రభుత్వ సాయమందేలా చూస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.20వేల నుంచి రూ.30వేల వరకు దళారులు దండుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. యాదాద్రికి ఎంఎంటీఎస్‌పై మళ్లీ ఆశలు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సాధారణ రోజుల్లో 30 వేలకు పైగా శని, ఆదివారాల్లో 50 వేల మంది దర్శించుకుంటున్నారు. నగరం నుంచి వెళ్లేవారే అత్యధికులు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే తక్కువ ఖర్చుతో ప్రయాణ వనరు కల్పించాలని నిర్ణయించింది. ఎంఎంటీఎస్‌ రెండోదశ పొడిగింపే సరైనదని భావించింది. ప్రణాళికలు సిద్ధం చేసినా అది పట్టాలెక్కలేదు. తాజాగా మంత్రి కేటీఆర్‌ ప్రకటనతో ఆశలు చిగురించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మెయిన్స్‌లో మెరవాలంటే...

తెలంగాణ పోలీసు నియామక మండలి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించినవారికి డిసెంబరు 8 నుంచి జనవరి 3 వరకూ దేహదార్ఢ్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఇందులో అర్హత పొందినవారికి మెయిన్‌ పరీక్ష రాసే అవకాశం వస్తుంది. కీలకమైన ఈ పరీక్షలో మెరుగైన మార్కులు సాధించటానికి ఏ అంశాలపై దృష్టి పెట్టాలో తెలుసుకుందాం! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. డిజిటల్‌ లావాదేవీలకు ఇ-మెయిల్‌ ఓటీపీ: ఎస్‌బీఐ

సైబర్‌ నేరాలను నియంత్రించేందుకు బ్యాంకులు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ఇ-మెయిల్‌ ఓటీపీని ప్రవేశ పెట్టింది. ఖాతాదారులు డిజిటల్‌ లావాదేవీలు చేసినప్పుడు అధీకృత ఇ-మెయిల్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని నమోదు చేస్తేనే లావాదేవీ పూర్తవుతుంది. ‘మీ డిజిటల్‌ లావాదేవీలను మరింత సురక్షితంగా నిర్వహించండి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు