Updated : 01 Jul 2022 13:12 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి..

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌ పేపర్‌-1కు 3,18,506 (90.62శాతం), పేపర్‌-2కు 2,51,070 (90.35శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు.

టెట్‌ పేపర్‌-1లో 32.68 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. పేపర్-2లో 49.64 శాతం మంది పాస్‌ అయ్యారు. టెట్ పేపర్ -1లో 1,04,078 మంది అభ్యర్థులు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కొత్త సీఎంకు అసెంబ్లీలో బలపరీక్ష.. సోమవారానికి గడువు..!

మహారాష్ట్ర(Maharashtra) రాజకీయాల్లో దాదాపు పదిరోజుల పాటు కొనసాగిన అనిశ్చితి.. అసమ్మతి నేత ఏక్‌నాథ్‌ శిందే(Eknath Shinde) గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ముగిసింది. ఇక ఆయన తన ప్రభుత్వానికి ఉన్న బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అందుకు గవర్నర్ సోమవారం వరకు గడువు విధించారు. ఆ నిమిత్తం మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఈ నెల మూడో తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. తొలిరోజు సమావేశంలో స్పీకర్‌ను ఎన్నుకొని, తర్వాత ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నుపుర్‌ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి

మహమ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర దుమారానికి తెరలేపిన భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యల అనంతరం దేశంలో జరిగిన ఘటనలకు ఆమే బాధ్యురాలని న్యాయస్థానం మండిపడింది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సీఎం శిందే, రెబల్ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయండి..!

శివసేన ఎమ్మెల్యేల తిరుగబాటుతో అధికారాన్ని కోల్పోయిన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏక్‌నాథ్‌ శిందే సహా కొంతమంది రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత విషయం తేలేంతవరకు వారిని అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా సస్పెండ్‌ చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు కోర్టు నిరాకరించింది. రెబల్‌ ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన ఇతర పిటిషన్లతో కలిపి జులై 11నే విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్రభుత్వం మారగానే.. శరద్‌ పవార్‌కు ఐటీ నోటీసులు..!

5. బంగారం కొనుగోలుదారులకు షాక్‌.. దిగుమతి సుంకం పెంపు!

బంగారం (Gold) కొనుగోలుదారులకు కేంద్రం షాకిచ్చింది. పసిడిపై దిగుమతి సుంకాన్ని (Tax on Gold) పెంచింది. ప్రస్తుతం 10.75 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచింది. బంగారం దిగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో కరెంట్‌ ఖాతా లోటును అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. జూన్‌ 30 నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది.ఇంతకుముందు బంగారంపై ప్రాథమిక దిగుమతి పన్ను 7.5 శాతంగా ఉంది. ఇప్పుడది 12.5 శాతానికి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్‌..!

‘తెలిసి తెలిసి ఫ్లాప్‌ సినిమా తీయం కదా’.. చాలా మంది దర్శకులు/నటులు ఇంటర్వ్యూల్లో చెప్పే మాట ఇది. కావచ్చు.. కానీ, చూసిన కథలనే మళ్లీ మళ్లీ ప్రేక్షకుడు కూడా చూడలేడు కదా! విభిన్న కథలతో కొందరు దర్శకులు సినిమాలు తీస్తుంటే.. మరికొందరు దర్శకులు/నటులు ఇంకా అవే పాత కథలకు కొత్త పెయింట్‌ వేసి వదిలేస్తున్నారు. ఒకప్పుడు కథ-కాకరకాయ లేకపోయినా స్టార్‌ హీరో అనే ట్యాగ్‌తో సినిమాలు సేల్‌ అయ్యేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రేక్షకుడికి అంత సమయం కూడా లేదు. సినిమా బాగుందా? లేదా?అంతే! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ పొడిగింపు

  మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను న్యాయస్థానం పొడిగించింది. మే 23 నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్న అనంతబాబు రిమాండ్‌ నేటితో ముగియడంతో పోలీసులు ఆయన్ను ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. గతనెల 17న ఎమ్మెల్సీ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. నేటితో రిమాండ్‌ ముగియనున్న నేపథ్యంలో మళ్లీ దాన్ని ఈనెల 15 వరకు పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీ20, వన్డేలకు.. టీమ్‌ఇండియా జట్లు ఇవే..

ఇంగ్లాండ్‌తో నేటి నుంచి ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌ పూర్తయ్యాక టీమ్‌ఇండియా.. ఆ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జులై 7, 9, 10 తేదీల్లో టీ20లు జరగనుండగా.. 12, 14, 17 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. అందుకోసం భారత జట్టు సెలెక్షన్‌ కమిటీ వేర్వేరు జట్లను ప్రకటించింది. అయితే, టీ20 సిరీస్‌కు ప్రత్యేకంగా రెండు బృందాలను ఎంపిక చేయడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అది అర్థమయ్యేసరికి బుమ్రాకు సమయం పట్టింది: సంజన

9. Andhra News: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టు స్టే

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లను విక్రయిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. అనంతరం తుది వ్యాజ్యాల విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది. టికెట్లను ప్రభుత్వమే విక్రయించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన సవరణ చట్టం, తదనంతరం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. India Corona: అవే హెచ్చుతగ్గులు.. కొనసాగుతోన్న కరోనా వ్యాప్తి..!

స్వల్ప హెచ్చుతగ్గులతో దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా కొత్త కేసులు కాస్త తగ్గి.. 18 వేల నుంచి 17 వేలకు దిగొచ్చాయి. నిన్న 5.02 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 17,070 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 3.40 శాతంగా నమోదైంది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో వైరస్ విస్తరిస్తోందని శుక్రవారం ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. దాంతో క్రియాశీల కేసులు 1,07,189(0.25 శాతం)కి ఎగబాకాయి. నిన్న 14,413 మంది కోలుకోగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని