Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. తెలంగాణ బడ్జెట్‌లో శాఖల వారీ కేటాయింపులు.. ముఖ్యాంశాలివీ..
ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని ఆర్థికమంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ (Telangana Budget)ను మంత్రి ప్రవేశపెట్టారు. రూ.2,90,396కోట్లతో పద్దును సభ ముందుకు తీసుకొచ్చారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు, మూలధన వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి రూ.26,831 కోట్లు, నీటిపారుదల రంగానికి 26,885 కోట్లు కేటాయించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ఎమ్మెల్యేలకు ఎర కేసు.. హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కేసును సీబీఐకి అప్పగించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం, భారాస ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సీబీఐకి అప్పగిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తప్పుబట్టలేమని.. అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉందని.. తీర్పును 15 రోజుల పాటు అమలు చేయకుండా చూడాలని సీజే ధర్మాసనాన్ని అడ్వకేట్ జనరల్ కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ‘అదానీ’ అంశంపై చర్చకు పట్టు.. పార్లమెంట్‌లో కొనసాగుతున్న వాయిదాల పర్వం
హిండెన్‌బర్గ్ సంస్థ నివేదిక, అదానీ (Adani Group) కంపెనీల షేర్ల భారీ పతనం అంశాలపై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంట్ (Parliament)లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాగానే ఈ అంశాలపై చర్చించాలంటూ ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. అందుకోసం వాయిదా తీర్మానాలు ఇవ్వగా.. ఉభయ సభల సభాధ్యక్షులు తిరస్కరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఈ వారం ఇటు థియేటర్ అటు ఓటీటీ సందడే సందడి
సాధారణంగా ఫిబ్రవరిలో కొత్త సినిమాలు థియేటర్‌కు రావడానికి అంత ఆసక్తి చూపవు. కానీ, ఈసారి ప్రతివారం ఒకట్రెండు ఆసక్తికర చిత్రాలు సందడి చేయనున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైన సినిమాలు ఇవే.. థియేటర్లు: ఫిబ్రవరి 9- వేద. ఫిబ్రవరి 10- కల్యాణ్‌రామ్ ‘అమిగోస్’, పాప్‌కార్న్, ఐపీఎల్, దేశం కోసం భగత్ సింగ్, చెడ్డీ గ్యాంగ్ తమాషా. ఓటీటీ: ఫిబ్రవరి 8- తునివు/తెగింపు(నెట్‌ఫ్లిక్స్), ఫిబ్రవరి 9- రాజయోగం(డిస్నీ+హాట్‌స్టార్). ఫిబ్రవరి 10- ఫర్జీ(అమెజాన్ ప్రైమ్ వీడియో), కళ్యాణం కమనీయం(ఆహా), నిజం విత్ స్మిత-టాక్ షో(సోనీలివ్). పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఇలాంటి బాధ మరెవరికీ రావొద్దు: ఎలాన్ మస్క్
ట్విటర్ (Twitter)ను కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ (Elon Musk) తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆ సంస్థను గట్టెక్కించడంపైనే దృష్టిని కేంద్రీకరించారు. మరోవైపు ఆయన నేతృత్వంలోని మరో రెండు కీలక సంస్థలు టెస్లా, స్పేస్‌ఎక్స్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత మూడు నెలలు ‘‘చాలా కఠినంగా’’ గడిచాయని తాజాగా ఆయనే స్వయంగా వెల్లడించారు. ట్విటర్ (Twitter)ను దివాలా ముప్పు నుంచి రక్షించేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందంటూ ఆదివారం ట్వీట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. తుర్కియే, సిరియాలో భారీ భూకంపం.. 195 మంది మృతి
తుర్కియే (Turkey), సిరియా (Syria)లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం (EarthQuake) సంభవించి పలు నగరాల్లో వందలాది భవనాలు కుప్పకూలాయి. ఈ విలయం కారణంగా రెండు దేశాల్లో ఇప్పటివరకు కనీసం 195 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో వెయ్యి మంది వరకు గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భూకంపం సంభవించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. మరోసారి కోహ్లీ స్వర్ణ యుగం ఖాయం: పాక్ మాజీ కెప్టెన్
భారత బ్యాటర్ కింగ్ కోహ్లీ (Virat Kohli) కెరీర్‌లో మరోసారి స్వర్ణయుగం రానుందని పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అభిప్రాయపడ్డాడు. శ్రీలంక స్టార్ ఆటగాడు సంగక్కర కెరీర్ లాగే విరాట్ (Virat Kohli) భవిష్యత్తు కూడా ఉండనుందని జోస్యం చెప్పాడు. భట్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ ‘‘భవిష్యత్తులో విరాట్ (Virat Kohli) అత్యుత్తమ ఆట మరోసారి కనువిందు చేయనుంది. విరాట్ ఇప్పటికే స్వేచ్ఛగా ఆడుతున్నాడు. ఇంకా అతడి స్థాయి ఆటను అందుకోలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ముషారఫ్‌పై థరూర్ ట్వీట్.. భాజపా తీవ్ర అభ్యంతరం!
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ (Pervez Musharraf) మరణంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ (Shashi Tharoor) చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. శాంతికోసం గట్టిగా ప్రయత్నించిన వ్యక్తిగా ముషారఫ్ (Pervez Musharraf)ను అభివర్ణించడంపై అధికార భాజపా నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మన దేశ సైనికులను చిత్ర హింసలకు గురి చేసిన వ్యక్తిని శాంతి కోసం ప్రయత్నించిన వ్యక్తిగా ఎలా అభివర్ణిస్తారని ప్రశ్నించారు. దీనికి థరూర్ (Shashi Tharoor) తిరిగి కౌంటర్ ఇవ్వడంతో వివాదం పెద్దదైపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. నా వాట్సాప్ డేటా లీక్ చేస్తున్నారు.. స్టార్ కపుల్‌పై కంగనా ఆరోపణలు
బాలీవుడ్(Bollywood)లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut). ఏ అంశం గురించైనా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా మరోసారి తనపై ఎవరో నిఘా పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యాలు బీ టౌన్‌లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఎవరో తన ప్రతి కదలికను గమనిస్తున్నారని, తన వ్యక్తిగత సమాచారాన్ని కూడా లీక్ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించింది కంగనా. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. మాఘ పౌర్ణమి వస్తే ఆ గ్రామం ఖాళీ..
మన దేశంలో అనేక ప్రాంతాల్లో అరుదైన ఆచారాలు, వైవిధ్యమైన సంప్రదాయాలు పాటించే వారిని మనం చూస్తూనే ఉంటాం. అదే రీతిలో అగ్గిపాడు అనే ఆచారం అరిష్టం నుంచి ఊరిని, ప్రజలను ఎన్నోఏళ్లుగా కాపాడుతోందంటున్నారు అనంతపురం జిల్లాలోని ఓ గ్రామవాసులు. ఇంతకీ ఆ వింత ఆచారం ఏంటి? వారి వేధిస్తున్న సమస్య ఏంటో చూద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
panaji: గోవాలో డచ్ మహిళపై కత్తితో దాడి.. నిందితుడి అరెస్టు
-
Politics News
KotamReddy: ఆయన చెబితే రాజధాని కదిలే అవకాశం లేదు: కోటంరెడ్డి
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Mrunal Thakur: నటిని అవుతానంటే ఇంట్లోవాళ్లు సపోర్ట్ చేయలేదు: మృణాల్ ఠాకూర్
-
Crime News
Delhi: ప్రాణం తీసిన మస్కిటో కాయిల్.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
-
General News
Bhadrachalam: వైభవంగా భద్రాద్రి రామయ్య పట్టాభిషేకం