Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు.. @ 5PM

Updated : 16 Mar 2023 20:25 IST

1. MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు.. అరుణ్ పిళ్లై కస్టడీ పొడిగింపు

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఈడీ పేర్కొంది. దర్యాప్తులో భాగంగా కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. తాను హాజరుకాలేనని అధికారులకు ఈ-మెయిల్‌ ద్వారా లేఖ పంపిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Canada: ఫేక్‌ ఆఫర్‌ లెటర్లు..? 700 మంది భారతీయ విద్యార్థులకు బహిష్కరణ గండం..!

ఉన్నత విద్యను (Foreign Education) అభ్యసించేందుకు భారత్‌ నుంచి విదేశాలకు వెళ్తోన్న వారి సంఖ్య ప్రతిఏటా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు యూరప్‌ దేశాలకూ భారతీయ విద్యార్థులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో కెనడా (Canada) విద్యా సంస్థల్లో అడ్మిషన్‌ కోసం ఇచ్చిన ఆఫర్‌ లెటర్లలో కొన్ని తప్పుడువి (Fake Offer Letter) ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జీహెచ్‌ఎంసీలో పలుచోట్ల వడగళ్ల వాన.. మరో రెండు రోజులూ వర్షాలే..!

గ్రేటర్‌ హైదరాబాద్‌ (GHMC) పరిధిలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం (Hyderabad rains) కురిసింది. ఈ వర్షాలతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొన్ని చోట్ల ఆకాశంలో మెరుపులు.. మేఘాల గర్జనలకు జనం భయపడుతున్నారు.పశ్చిమ బెంగాల్‌ నుంచి ఝార్ఖండ్‌ మీదుగా ఒడిశా వరకు ద్రోణి ఏర్పడటం.. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్‌ తీరం వరకూ మరో ద్రోణి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి రాష్ట్రం వైపు తేమ గాలులు వీస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. OTT Movies: సినీ ప్రియులారా సిద్ధం కండి.. రేపు ఒక్కరోజే 18 సినిమాలు/సిరీస్‌లు

ఇటీవల కాలంలో సినిమా థియేటర్లలో పెద్ద సినిమాలేమీ విడుదల కాలేదు. దీంతో సినీ ప్రియులు ఓటీటీ వేదికగా కొత్త సినిమాలు, సిరీస్‌లు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సినీ ప్రేమికుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వారం వారం కొత్త కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అలా, ఈవారం అందులోనూ కేవలం రేపు ఒక్కరోజే దాదాపు 18 సినిమాలు/సిరీస్‌లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఇంతకీ ఆ సినిమాలు/సిరీస్‌లు ఏమిటంటే.! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. IPL - MSD: ఐపీఎల్‌ 2024లోనూ ఎంఎస్ ధోనీ ఆడతాడా..? రైనా రెస్పాన్స్‌ ఇదే..!

మార్చి 31 నుంచి ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2023) పదహారో సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ గుజరాత్‌ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (GT vs CSK) జట్ల మధ్య పోరుతో మెగా టోర్నీ షురూ అవుతుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీ (MS Dhoni) ప్రాక్టీస్‌ను కూడా ప్రారంభించేశాడు. అయితే, ఈ సీజన్‌ తర్వాత ధోనీ ఐపీఎల్‌కూ గుడ్‌బై చెప్పేస్తాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే విషయాన్ని సురేశ్‌ రైనా (Suresh Raina) దృష్టికి తీసుకెళ్లగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Cheetah: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. ఇద్దరు గల్లంతు!

భారత సైన్యాని(Indian Army)కి చెందిన ఓ హెలికాప్టర్‌(Helicoptor) కుప్పకూలింది. అరుణాచల్‌ప్రదేశ్‌(Arunachal Pradesh)లోని మండలా(Mandala) పర్వత ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రోజువారీ విధుల్లో భాగంగా ఇక్కడి సెంగే గ్రామం నుంచి మిసామారీకి వెళ్తుండగా.. మార్గమధ్యలో ఈ ప్రమాదం(Helicoptor Crash) జరిగినట్లు సైన్యం వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Delhi Liquor Scam: ఒంగోలు వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఈడీ నోటీసులు

దిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liqour Scam)లో వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే మాగుంట తనయుడు రాఘవరెడ్డి ఈ కేసులో అరెస్టయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. AP Budget: ఏపీ బడ్జెట్‌ రూ.2.79 లక్షల కోట్లు.. ముఖ్యాంశాలివే!

ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌(AP budget 2023)ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి(Buggana Rajendranath Reddy) అసెంబ్లీలో(AP Assembly) ప్రవేశపెట్టారు. పోతన పద్యంతో, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వ్యాఖ్యలతో తన బడ్జెట్‌ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఈ బడ్జెట్‌ సుస్థిర అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి సారించామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Airport: ప్రపంచంలోనే ది బెస్ట్‌ విమానాశ్రయం ఇదే.. రెండేళ్ల తర్వాత మళ్లీ..!

సింగపూర్‌లోని ‘ఛాంగి’ అంతర్జాతీయ విమానాశ్రయం (Changi International Airport) ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా నిలిచింది. రెండేళ్ల తర్వాత ఖతార్‌ (Qatar)ను వెనక్కి నెట్టి మళ్లీ తన స్థానాన్ని తిరిగి సాధించుకుంది. కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో సింగపూర్‌ విదేశీ విమానాల రాకపోకలపై తీవ్ర ఆంక్షలు విధించింది. దీంతో రెండేళ్ల క్రితం ఆ స్థానాన్ని ఖతార్‌ చేజిక్కించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Asia Cup: ఆసియా కప్‌ 2023.. కుదిరితే పాక్‌లో.. లేకపోతే శ్రీలంకలో నిర్వహించాలి: అక్తర్

ఆసియా కప్‌  (Asia Cup 2023) నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ (ACC) సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ.. తుది నిర్ణయం మాత్రం ఇంకా వెలువడలేదు. పాక్‌లో ఆడేది లేదని బీసీసీఐ ఇప్పటికే కరాఖండిగా చెప్పేసింది. అలాగని భారత్‌ లేకుండా ఆసియా కప్‌ను నిర్వహిస్తే పాకిస్థాన్‌కు ఆదాయపరంగా ఇబ్బంది తప్పదు. ఆసియా కప్‌ టోర్నీనే కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ 2025  నిర్వహణ కూడా పాకిస్థాన్‌దే కావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని