Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. పొంగులేటి.. జూపల్లి నాకే రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నారు: ఈటల
భారత్ రాష్ట్ర సమితి (భారాస) బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు భాజపాలో చేరికపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ భాజపాలో చేరడం కష్టమే అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఈటల మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ప్రధాని మోదీ టార్గెట్ విజన్-2047: కేంద్ర మంత్రి మేఘ్‌వాల్
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ గృహాలను నిర్మించారని.. అయితే, అవి లబ్ధిదారులకు కాకుండా అధికారులు, రాజకీయ నేతల మధ్య ఎందరికి అందాయో తెలియదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్‌వాల్ అన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ఇళ్ల నిర్మాణాలకు జియో ట్యాగింగ్ చేయడం ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించగలుగుతున్నామని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఈ గుంటూరు కుర్రాడికి ఘాటెక్కువే.. ఆటకు అంబటి రాయుడు గుడ్‌బై
గుంటూరు అతడి ఊరు.. మిర్చిలాంటి ఘాటు అతడి బ్యాటింగ్‌తోపాటు మాటల్లోనూ కనిపిస్తుంది.. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా.. తన ఆటతీరుతోనే కాకుండా మైదానం వెలుపలా దూకుడైన ప్రవర్తనతో పాపులర్ అయిన తెలుగు క్రికెటర్. ఎలాంటి విషయంలోనైనా ముక్కుసూటిగా ఉండే స్వభావం అతడి సొంతం. తాజాగా ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్‌కు ఇంకాస్త సమయం ఉందనగా ఈ మెగా లీగ్ నుంచీ రిటైర్ అవుతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ప్రజలను మానవకవచాలుగా వాడుకొని దాడులు.. మణిపుర్ వేర్పాటు వాదుల కుట్ర
మహిళలు, పిల్లలతో సహా అమాయక ప్రజలను కవచాలుగా వాడుకొని గ్రామాలపై దాడులు చేయాలన్న మణిపూర్(Manipur) వేర్పాటు వాదుల కుట్రను సైన్యం బహిర్గతం చేసింది. మణిపుర్‌లో హింసే లక్ష్యంగా వేర్పాటు వాదులు ఈ కుట్రను పన్నినట్లు పేర్కొంది. ఇటీవల వేర్పాటువాదల కమ్యూనికేషన్ వ్యవస్థలోకి స్థానికంగా ఉన్న సైన్యానికి చెందిన ‘స్పియర్ కోర్ కమాండ్’ చొరబడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. కొత్త పార్లమెంట్‌ను చెక్కిన శిల్పి.. ఎవరీ బిమల్ పటేల్
దేశ చరిత్రలో సరికొత్త ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించే పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అట్టహాసంగా ప్రారంభించారు. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం.. దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని అడుగడుగునా ప్రతిబింబిస్తోంది. మరి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ నూతన భవనాన్ని చెక్కిన శిల్పి ఎవరో తెలుసా..? ప్రముఖ ఆర్కిటెక్ట్ బిమల్ హస్ముఖ్ పటేల్. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. కెనడాలో ఓ పెళ్లివేడుకలో పంజాబీ గ్యాంగ్‌స్టర్ హత్య..!
పంజాబ్ మూలాలున్న ఓ గ్యాంగ్‌స్టర్ (Gangster) కెనడా(Canada)లో హత్యకు గురయ్యాడు. ఓ పెళ్లి వేడుకలో పాల్గొని డ్యాన్స్ చేసిన కొద్దిసేపటికే అతడిపై దాడి జరిగింది. కెనడాలో టాప్-10 గ్యాంగ్‌స్టర్లలో ఒకడైన అమర్‌ప్రీత్ సమ్రా అలియాస్ చిక్కీను అతడి ప్రత్యర్థి గ్యాంగ్ ‘బ్రదర్స్ గ్రూప్’ సభ్యులు పట్టపగలే హత్య చేశారు. ఈ ఘటన వాంకోవర్ నగరంలో చోటు చేసుకొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఐపీఎల్ ఫైనల్‌పై వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా ట్వీట్!
ఐపీఎల్ 16 (IPL 2023)లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడింది. దీంతో మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో సీఎస్‌కే, జీటీ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఎంతో మంది అభిమానులు తమ ఫేవరెట్ జట్టు, ఆటగాళ్లకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. రిజర్వ్‌డే మ్యాచ్.. గత చరిత్రను ధోనీ తిరగరాస్తాడా...?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో తొలిసారి వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డేకు వెళ్లింది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ (CSK vs GT) జట్ల మధ్య ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ పోరు ఆదివారం జరగాల్సి ఉంది. అయితే, వర్షం వల్ల నేటికి (సోమవారం) మ్యాచ్ వాయిదా పడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. పందెం కట్టి కారుతో సాహస యాత్ర.. 120 ఏళ్ల కిందటి ఘనత ఇది!
అమెరికాలో కార్ల విక్రయాలు అప్పుడప్పుడే ఊపందుకుంటున్నాయి. 1900వ సంవత్సరంలో 8000 కార్లు ఉంటే 1903 నాటికి ఆ సంఖ్య 32,920కి చేరింది. అప్పటికి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కార్లు తిరగడానికి అనువైన రోడ్లు ఉన్నాయి. అలాంటి సమయంలో గుర్రపు బగ్గీల కన్నా కార్లు మెరుగైనవని హరేషియో నెల్సన్ జాక్సన్ అనే వ్యక్తి వాదించాడు. తన వాదనను నిరూపించడానికి 50 డాలర్ల పందెం కాసి ఓ అరుదైన సాహస యాత్రకు శ్రీకారం చుట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. డౌన్‌లోడ్‌కు BGMI రెడీ.. ఆడేందుకు ఇకపై టైమ్ లిమిట్
ప్రముఖ మల్టీ ప్లేయర్ షూటింగ్ గేమ్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) భారత్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆండ్రాయిడ్ (Android), ఐఓఎస్ (iOS) స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇకపై యూజర్లు గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ల నుంచి ఈ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాదాపు ఏడాది తర్వాత గేమింగ్ లవర్స్‌కి అందుబాటులోకి వచ్చిన ఈ గేమ్‌లో.. సదరు గేమింగ్ సంస్థ క్రాఫ్టన్ కొన్ని మార్పులు చేసింది. ఆడేందుకు టైమ్ లిమిట్ పెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి సస్పెండ్
-
ODI WC 2023: హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. మేమంతా ఫిదా: పాక్ క్రికెటర్
-
Srinivas Goud: మోదీ క్షమాపణ చెప్పి సభలో మాట్లాడాలి: శ్రీనివాస్‌గౌడ్
-
Siddharth: దానివల్ల మా సినిమాకు ఎంతో నష్టం.. ప్రెస్‌మీట్ అడ్డుకోవడంపై సిద్ధార్థ్
-
World Culture Festival : మానసిక అనారోగ్యం అనేది అతి పెద్ద సమస్య : శ్రీశ్రీ రవిశంకర్
-
Vizag: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పెట్టె.. అందులో ఏముందో?