Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 11 Apr 2024 16:59 IST

1.  బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌

 ఫ్యాషన్ ప్రియుల నుంచి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak)కు నిరసన సెగ తగిలింది. ఓ ఇంటర్వ్యూలో ఆయన ధరించిన దుస్తులు, బూట్లు మ్యాచ్‌ కాకపోవడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. దాంతో ఆయన వారికి సారీ చెప్పి, సమాధానపర్చాల్సి వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా తెలుపు- నీలం రంగు షర్ట్‌, ప్యాంట్‌కు కాంబినేషన్‌లో అడిడాస్‌ సంస్థకు చెందిన వైట్ సాంబా స్నీకర్స్‌ను సునాక్‌ ధరించారు. ఇది ఫ్యాషన్ ప్రేమికులను మెప్పించలేదు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ఎన్నికల వేళ.. రూ.100 కోట్ల నగదు, మద్యం, బంగారం స్వాధీనం: మీనా

ఏపీలో ఎన్నికల వేళ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు రూ.100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్‌, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు సరిహద్దు ప్రాంతాలు, జిల్లా సరిహద్దుల వద్ద సోదాలను మరింత విస్త్రృతం చేస్తున్నామని వివరించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3.  వైకాపా.. ఫేక్‌ పరిశ్రమను తెరపైకి తెచ్చింది: చంద్రబాబు

జగన్‌ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించటంతో.. ఫేక్‌ పరిశ్రమను వైకాపా తెరపైకి తెచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. గురువారం పార్టీ ముఖ్యనేలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘‘సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వీడియోలతో గందరగోళం సృష్టిస్తున్నారు. ఈటీవీ విశ్వసనీయత దెబ్బతీసేలా ఆ ఛానెల్‌ పేరుతో వైకాపా ఫేక్‌ వీడియోలు సృష్టిస్తోంది. ప్రజలు నమ్మే వార్తా ఛానెల్‌ పేరుతో తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. భారత్‌ మాతో కలిసి రావాలి.. మోదీ వ్యాఖ్యలపై చైనా

భారత్‌, చైనాల మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు (India China Ties) ఈ ప్రాంతానికే కాదు, ప్రపంచానికీ కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్న విషయం తెలిసిందే. మోదీ వ్యాఖ్యలపై చైనా (China) స్పందిస్తూ.. స్థిరమైన, సత్సంబంధాలు ఇరుదేశాల ఉమ్మడి ప్రయోజనాలకు మేలు చేకూరుస్తాయని తెలిపింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. రూ.లక్ష కోట్ల మోసం.. మహిళా టైకూన్‌కు మరణశిక్ష!

ట్రూంగ్‌ మై లాన్‌.. వియత్నాం (Vietnam)లోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరు. ‘వాన్‌ థిన్‌ ఫాట్‌’ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఛైర్మన్‌గా ఉన్న ఆమె దాదాపు రూ.లక్ష కోట్లకు (12.5 బిలియన్‌ డాలర్లు) సంబంధించి బ్యాంకులను మోసం చేసిన కేసులో దోషిగా తేలారు. దీంతో ఆమెకు (Truong My Lan) అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దేశంలో సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచిన ఆమెపై కోర్టు కేసు తీర్పు ఎలా ఉండబోతోందనే విషయంపై వియత్నాం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6.భాజపాతో పొత్తుకు సిద్ధమై : శరద్ పవార్‌పై ఎన్సీపీ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP)లో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్, తన వర్గం నేతలతో కలిసి గతేడాది శరద్‌పవార్‌ (Sharad Pawar)కు షాకిచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత మహారాష్ట్రలో ఉన్న భాజపా-శివసేన ప్రభుత్వంతో చేతులు కలిపి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా తీసుకున్నారు. అయితే ఆ సమయంలో కమలం పార్టీతో కలిసేందుకు శరద్‌ పవార్ కూడా సిద్ధమైనట్లు అజిత్ వర్గం నేత ప్రఫుల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. దిల్లీ మద్యం కేసు.. కవితను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ

దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారాస ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తమ కస్టడీలోకి తీసుకుంది. ఇదే కేసులో గతంలో హైదరాబాద్‌లో ఆమెను ప్రశ్నించింది. ఈ కేసు వ్యవహారంలోనే ఈడీ ఆమెను అరెస్ట్‌ చేసింది. తిహాడ్‌ జైలులో ఉన్న కవితను సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో ఈ నెల 6న కేంద్ర దర్యాప్తు సంస్థ మరోసారి ప్రశ్నించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ‘మీకు చేతకాకపోతే చెప్పండి..’: పాక్‌కు రాజ్‌నాథ్‌ సింగ్‌ కౌంటర్‌

సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది పాకిస్థాన్‌ (Pakistan)పై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ (Rajnath Singh) మరోసారి విరుచుకుపడ్డారు. ముష్కర మూకలతో భారత్‌ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో దాయాది అసమర్థతను ఎద్దేవా చేశారు. అది తమకు చేతకాదని పాక్‌ భావిస్తే.. ఆ దేశానికి సహకారం అందించేందుకు తాము (India) సిద్ధంగా ఉన్నామని అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9.  ఏపీ ఇంటర్‌ ఫలితాలు రేపే.. ఎన్ని గంటలకంటే?

ఏపీలో ఇంటర్‌ పరీక్షల ఫలితాల (AP Inter Results) విడుదలకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు బోర్డు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ఆర్‌టీఐ కింద ఎన్నికల బాండ్ల వివరాలిచ్చేందుకు ఎస్‌బీఐ నిరాకరణ

ఎన్నికల బాండ్లకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కు (EC) ఇచ్చిన వివరాలను సమాచార హక్కు చట్టం (RTI) కింద ఇచ్చేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో వివరాలు అందుబాటులో ఉండగా.. విశ్వసనీయ సమాచారం అంటూ కారణం చూపి సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తును తిరస్కరించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని