Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

టాప్ 10 న్యూస్‌: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 02 Oct 2022 21:11 IST

1. జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు.. పార్టీ నేతల సమావేశంలో కేసీఆర్‌ నిర్ణయం

జాతీయ పార్టీ ఏర్పాటుపై తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ కసరత్తు తుది దశకు చేరింది. మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో ఇవాళ ప్రగతి భవన్‌లో సమావేశమైన కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈనెల 5న దసరా రోజు మధ్యాహ్నం 1.19గంటలకు సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ఖర్గే పేరు తెరమీదకు రావడంతో భాజపా నేతలకు భయం పట్టుకుంది: భట్టి విక్రమార్క

దేశంలో విభజన, అశాంతి అంశాలు ప్రజలను ఎంతోగానో అందోళనకు గురిచేస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అసమానతలు లేని దేశం కావాలని  మహాత్మాగాంధీ కోరుకున్నారని తెలిపారు. సీఎల్పీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. భాజపా పాలనలో ఆర్థిక అసమానతలు పెరిగాయని.. గాంధీ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఆ పార్టీ పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ‘ఆది పురుష్‌’ టీజర్‌ వచ్చేసింది.. విజువల్‌ వండర్‌గా!

సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రభాస్‌ (Prabhas) ‘ఆది పురుష్‌’ (Adipurush) టీజర్‌ వచ్చేసింది. రామాయణం ఇతివృత్తంగా రూపొందుతోన్న ఈ సినిమా టీజర్‌ను అయోధ్య వేదికగా చిత్ర బృందం ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. 1.40 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. రాముడి లుక్‌లో ప్రభాస్‌ ఒదిగిపోయారు. నీళ్లలో తపస్సు చేస్తూ కనిపించిన సన్నివేశం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేలా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. సఫారీలతో వన్డే సిరీస్‌.. భారత జట్టులోకి యువ ఆటగాళ్లు

అక్టోబర్‌ 6వ తేదీ ( గురువారం) నుంచి సఫారీలతో జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమ్‌కు శిఖర్ ధావన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. శ్రేయస్‌ అయ్యర్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. టీ20 సిరీస్‌కు పక్కన పెట్టడం విమర్శలు రావడంతో సంజూ శాంసన్‌కు వన్డే సిరీస్‌లో అవకాశం కల్పించింది. అలాగే భారత టీ20 లీగ్‌లో మెరిసిన యువ ఆటగాళ్లు రజత్‌ పాటిదార్, రాహుల్‌ త్రిపాఠికి స్థానం దక్కింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. వంటనూనెల ధరల కట్టడే లక్ష్యంగా.. సుంకాలపై మరో 6నెలలు రాయితీ

వంటనూనెల దిగుమతి సుంకంపై కల్పిస్తున్న రాయితీలను మార్చి 2023 వరకు కొనసాగుతాయని కేంద్ర ఆహార శాఖ ఆదివారం ప్రకటించింది. దేశీయంగా సరఫరాను పెంచి ధరల్ని కట్టడి చేయాలన్న ఉద్దేశంతోనే ఉపశమనాలను మరో ఆరు నెలలు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. అంతర్జాతీయంగా ధరలు దిగొస్తున్నాయని.. ఫలితంగా దేశీయంగానూ ధరలు అదుపులోకి వస్తున్నాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఆనంద్‌ మహీంద్రాను ఆకట్టుకున్న పరీక్ష అది..మీరూ ప్రయత్నిస్తారా?

ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా నెట్టింట్లో ఏదైనా షేర్‌  చేశారంటే..కచ్చితంగా ఆది ఆసక్తికరంగానో, ఆలోచింపచేసేదిగానో ఉంటుంది. తాజాగా శనివారం ఆయన ఓ పోస్టును ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఒక వ్యక్తి మానసిక వయస్సును నిర్ణయించే పరీక్ష అది. ‘‘నా స్నేహితుడి కోరిక మేరకు ఈ పరీక్షను ప్రయత్నించి చూశాను. అద్భుతంగా ఉంది. వివాదాస్పదమైన ఫలితమేమీ ఇవ్వలేదు’’ అంటూ ఆనంద్‌ మహీంద్రా రాసుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. గుజరాత్‌లో పంజాబ్‌ సీఎం గర్బా స్టెప్పులు!

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ గర్బా స్టెప్పులు వేసి అలరించారు. ఆయన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో నిర్వహించిన శరన్నవరాత్రి ఉత్సవాలకు పంజాబ్‌ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే, కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన అభిమానులు, భక్తులు గర్బా వేయాలంటూ మాన్‌ను కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


IND vs SA: లైవ్‌బ్లాగ్ కోసం క్లిక్ చేయండి


8. ములాయం సింగ్‌ ఆరోగ్యం విషమం.. ఐసీయూలో చికిత్స!

ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh) మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌ (Mulayam singh Yadav) ఆరోగ్యం విషమించినట్టు సమాచారం. దీంతో ఆయన్ను హరియాణా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కొన్ని అనారోగ్య కారణాల రీత్యా ఆగస్టు 22 నుంచి  ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న 82ఏళ్ల ములాయం సింగ్‌ యాదవ్‌ ఆరోగ్యం ఆదివారం క్షీణించడంతో ఆయన్ను ఐసీయూ వార్డులోకి మార్చినట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ఈ గెలుపు మీకే అంకితం: సచిన్‌ భావోద్వేగం

రోడ్‌ సేఫ్టీ టీ20 ప్రపంచ సిరీస్‌ను రెండో సారి కైవసం చేసుకున్న భారత లెజెండ్స్‌ జట్టు సంతోషంలో మునిగితేలుతోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ సచిన్‌ తెందూల్కర్‌ తన జట్టు సభ్యులను కొనియాడాడు. ఈ విజయాన్ని వారికి అంకితం ఇస్తున్నట్టుగా తెలిపాడు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ భావోద్వేగపూరిత పోస్ట్‌ చేశాడు.  ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన నమన్‌ ఓజా ఆటతీరును ప్రత్యేకంగా అభినందించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. మహారాష్ట్ర సీఎం శిందే ప్రాణాలకు ముప్పు! భద్రత పెంపు

మహారాష్ట్ర(Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే(Eknath Shinde) ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న సమాచారం మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్(SID)కు శనివారం సాయంత్రం ఈ విషయమై స్పష్టమైన సమాచారం అందింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ కమిషనర్ అశుతోష్‌ డుంబ్రే సైతం దీన్ని ధ్రువీకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని