Adipurush Teaser:‘ఆది పురుష్‌’ టీజర్‌ వచ్చేసింది.. విజువల్‌ వండర్‌గా!

యావత్‌ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రభాస్‌ ‘ఆది పురుష్‌’ టీజర్‌ వచ్చేసింది. రామాయణం ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమా టీజర్‌ను అయోధ్య వేదికగా చిత్ర బృందం ఆదివారం సాయంత్రం విడుదల చేసింది.

Published : 02 Oct 2022 19:11 IST

అయోధ్య: సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రభాస్‌ (Prabhas) ‘ఆది పురుష్‌’ (Adipurush) టీజర్‌ వచ్చేసింది. రామాయణం ఇతివృత్తంగా రూపొందుతోన్న ఈ సినిమా టీజర్‌ను అయోధ్య వేదికగా చిత్ర బృందం ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. 1.40 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. రాముడి లుక్‌లో ప్రభాస్‌ ఒదిగిపోయారు. నీళ్లలో తపస్సు చేస్తూ కనిపించిన సన్నివేశం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేలా ఉంది. దర్శకుడు ఓంరౌత్‌ (Om Raut) ముందు నుంచీ చెబుతున్నట్టే ఈ సినిమా విజులవ్‌ వండర్‌గా ఉండనుందని టీజర్‌ స్పష్టం చేసింది. (Adipurush Teaser)

లంకేశ్‌గా సైఫ్‌ అలీఖాన్, సీతగా కృతి సనన్‌, హనుమంతుడిగా దేవదత్త నాగే, లక్ష్మణుడిగా సన్నీసింగ్‌.. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలతో కట్టిపడేసేలా ఉన్నారు. ఈ పాన్‌ ఇండియా చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదలకానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని