Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 15 Mar 2024 17:07 IST

1. ఎలక్టోరల్‌ బాండ్లపై స్పందించిన నిర్మలా సీతారామన్‌

విరాళాలకు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల దాడులకు సంబంధం ఉందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఊహాగానం అంటూ కేంద్ర ఆర్థిక  మంత్రి నిర్మలా సీతారామన్‌ కొట్టి పారేశారు. ‘‘ఈడీ.. కంపెనీల తలుపులు తడితే తమను తాము రక్షించుకోవడానికి ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశారనుకోవడం ఊహాగానమే అవుతుంది. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన తర్వాత కూడా ఈడీ దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి కదా! దాన్నేమనాలి?’’ అని ప్రశ్నించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘కొత్త ఈసీల నియామకాలపై స్టే విధించలేం’: సుప్రీం

పదవీ విరమణ చేసిన మాజీ ఉన్నతాధికారులు జ్ఞానేష్‌కుమార్‌, సుఖ్బీర్‌సింగ్‌ సంధు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఎంపికైన సంగతి తెలిసిందే. వారి నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సీఏఏకు వ్యతిరేకంగా పిటిషన్లు.. విచారించేందుకు సుప్రీం ఓకే

కొత్తగా నోటిఫై చేసిన పౌరసత్వ సవరణ చట్టం(CAA) అమలుపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లు విచారించేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు (Supreme Court) అంగీకరించింది. మార్చి 19న విచారణ ఉంటుందని వెల్లడించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. యువ జంటలకు సుధామూర్తి సలహా ఇదే..!

కలహాలు లేని కాపురం ఉండనే ఉండదంటున్నారు ప్రముఖ విద్యావేత్త, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి (Sudha Murty). అయితే, అది గాలివానగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత భార్యాభర్తలిద్దరిపైనా ఉంటుందని అన్నారు. ‘ఇండియా టుడే’ నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి దంపతులు పాల్గొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చంద్రబాబు నివాసానికి క్యూ కట్టిన నేతలు.. అధినేత భరోసా

తెలుగుదేశం పార్టీ ప్రకటించిన రెండు జాబితాల్లో చోటు దక్కని ఆశావహులు చంద్రబాబు నివాసానికి క్యూ కట్టారు. నేతలను పిలిచి మాట్లాడుతున్న ఆయన.. వారి రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చి బుజ్జగిస్తున్నారు. పెదకూరపాడు అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్‌ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ను జీవీ ఆంజనేయులు తీసుకొచ్చారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జగనన్నా.. అంతఃకరణశుద్ధి అంటే అర్థం తెలుసా?: సునీత

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో నిందితులకు శిక్షపడాలని పోరాడుతున్న తనపై నింద మోపుతారా అని ఆయన కుమార్తె సునీతా నర్రెడ్డి (Suneetha Narreddy) ప్రశ్నించారు. హత్యతో తన కుటుంబానికి సంబంధముంటే ఎందుకు అరెస్ట్‌ చేయలేదని నిలదీశారు. వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన స్మారక సభలో ఆమె మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. జగనన్నా.. అద్దం ముందు నిల్చొని ప్రశ్నించుకోండి: షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు. చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి మరణంతో ఎక్కువగా నష్టపోయింది చిన్నమ్మ సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె సునీతాయేనని చెప్పారు. మాజీ మంత్రి వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన స్మారక సభలో ఆమె మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు

భారాస (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) నివాసంలో శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు చేపట్టింది. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న అధికారులు.. ఇంట్లోకి ఎవరినీ అనుమతించకుండా తనిఖీలు చేస్తున్నారు. దిల్లీ లిక్కర్‌ కేసుకు సంబంధించి ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ఇద్దరు మహిళా అధికారులు సహా 8మంది బృందం సోదాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ప్రణీత్‌రావు రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ)లో ఆధారాల ధ్వంసం కేసుకు సంబంధించి మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు పేర్కొన్నారు. నిందితుడు 3 రకాల నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. సాక్ష్యాల చెరిపివేత, ప్రజా ఆస్తుల ధ్వంసం, ఎలక్ట్రానిక్‌ ఎవిడెన్స్‌ టాంపరింగ్‌కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఈవీ పాలసీకి కేంద్రం ఆమోదం.. టెస్లా ఎంట్రీకి మార్గం సుగమం!

దేశంలో ఈవీల తయారీని ప్రోత్సహించేందుకు గానూ కేంద్రం ఇ-వెహికల్‌ పాలసీని (E-Vehicle Policy) తీసుకొచ్చినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనివల్ల దేశం ఈవీల తయారీకి గమ్యస్థానంగా మారడంతో పాటు అంతర్జాతీయ ప్రముఖ ఈవీ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలు కలుగుతుందని పేర్కొంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని