Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 19 Mar 2024 16:59 IST

1. ఈ ఎన్నికల్లో జగన్‌కు తగిన బుద్ధి చెప్తాం: మందకృష్ణ మాదిగ

ఏపీలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో మాదిగలకు సంక్షేమం లేకుండా చేసిందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఈ ఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసి తగిన బుద్ధి చెప్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలి: హరీశ్‌రావు

అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. వర్షంతో వరి, మొక్కజొన్నతో పాటు మామిడి సహా మరికొన్ని ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం కలిగిందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎకరాకు రూ.10వేలు నష్టపరిహారం ప్రకటించాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం, బుధవారం ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కిందిస్థాయి గాలులు దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే

దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘భారత్‌ వెలిగిపోతోందంటూ 2004లో భాజపా ప్రచారం చేసింది. అప్పుడు ఏం జరిగిందో.. ఇప్పుడు అవే ఫలితాలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అప్పటి గతే పడుతుంది’ అని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 2026లో బుల్లెట్‌ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్‌ ఇండియా’ చిప్‌

దేశంలో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తాజాగా కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. 2026 నాటికి ఈ రైలు పట్టాలపై పరుగులు పెడుతుందన్నారు. ‘రైజింగ్‌ భారత్‌ సమ్మిట్‌’లో పాల్గొన్న ఆయన పలు కేంద్ర ప్రాజెక్టుల పురోగతిపై మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మ్యాచ్‌ జరుగుతుండగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో సిగరెట్ తాగిన క్రికెటర్

పాక్‌ ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ వసీమ్‌ వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)లో ఇస్లామాబాద్‌ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. సోమవారం ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుండగా టీమ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సీఏఏపై స్టే కోరుతూ పిటిషన్లు.. కేంద్రానికి మూడు వారాల గడువిచ్చిన సుప్రీం

లోక్‌సభ ఎన్నికలకు ముందు పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) కేంద్రం అమల్లోకి తీసుకురావడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court)లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఎన్డీఏ ‘మహా’ వ్యూహం.. ఉద్ధవ్‌కు చెక్‌ పెట్టేందుకు రంగంలోకి రాజ్‌..!

శివసేన ఉద్ధవ్‌ వర్గం భారీ సంఖ్యలో ఓట్లను చీల్చకుండా ఎన్‌డీఏ కూటమి వ్యూహానికి మరింత పదును పెట్టింది. వీలైనన్ని పార్టీలను కూటమిలో చేర్చుకొని మహారాష్ట్రలో అత్యధిక పార్లమెంట్ స్థానాలను సాధించాలని చూస్తోంది. ఉద్ధవ్‌ సోదరుడు, మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్‌ సేన అధినేత రాజ్‌ ఠాక్రేను తమ జట్టులో చేర్చుకొనేందుకు ఎన్డీఏ పావులు కదుపుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రీక్లైమాక్స్‌లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి ఇప్పటివరకూ బయటకు రాని ఆసక్తికర విషయాలను ఎస్‌.ఎస్‌.రాజమౌలి బయటపెట్టారు. ఎన్టీఆర్‌(భీమ్‌)కు జోడీగా బ్రిటిష్ యువతి జెన్నీ పాత్రలో ఓలివియా మోరిస్‌ నటించింది. ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంకొన్ని సన్నివేశాలు ఉన్నాయని, కానీ, నిడివి కారణంగా ఎడిటింగ్‌లో తీసేయాల్సి వచ్చిందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నాడు హిట్లర్‌ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్‌. కెనడీ.. వైరల్‌ అవుతున్న ఈసీ పోస్ట్‌

మేఘాలయలో 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ పార్టీ తరఫున పోటీ చేసిన అడాల్ఫ్‌ లు హిట్లర్‌ కోడ్‌ ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో స్థానిక ఎస్పీ ఆయనను అరెస్టు చేశారు. ఆ పోలీసు అధికారి పేరు జాన్‌.ఎఫ్‌.కెనడీ. దీంతో మరుసటి రోజు వార్తాపత్రికల్లో ‘మేఘాలయలో హిట్లర్‌ను కెనడీ అరెస్టు చేశారు’ అంటూ కథనాలు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని