Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 May 2022 09:14 IST

1. జీవితకాల బాదుడు

వాహన కొనుగోలుదారులపై రాష్ట్ర ప్రభుత్వం పన్నుల భారం మోపింది. వాహనాల జీవితకాల పన్ను(లైఫ్‌ ట్యాక్స్‌)ను పెంచుతూ నిర్ణయించింది. ఈ విధానం సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. ఇప్పటివరకు అమలులో ఉన్న 2 శ్లాబుల విధానాన్ని ప్రభుత్వం 4 శ్లాబులకు పెంచింది. గతంలో రూ.10 లక్షలలోపు విలువ చేసే వాహనాలకు ఒక పన్ను, రూ.10 లక్షల విలువ దాటిన వాహనాల పన్ను మరొకటిగా ఉండేది. తాజాగా వాహన విలువలను 4 విభాగాలుగా విభజించి పన్నులను వసూలు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వచ్చేస్తున్నాడు.. నయా నాదల్‌

చిన్నతనంలో ఆ పిల్లాడు చూసిన తొలి టెన్నిస్‌ టోర్నీ అది.. అప్పుడు దిగ్గజం నాదల్‌ టైటిల్‌ గెలిచాడు.. అది చూసి తన ఆరాధ్య ఆటగాడి లాగే ఆ ట్రోఫీని సొంతం చేసుకోవాలని ఆ పిల్లాడు నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు 19 ఏళ్ల వయసులో ఆ లక్ష్యాన్ని సాధించాడు. అది కూడా నాదల్‌, జకోవిచ్‌లపై నెగ్గి విజేతగా నిలిచాడు. ఆ టోర్నీ మాడ్రిడ్‌ ఓపెన్‌.. ఇప్పుడు కుర్రాడిగా మారిన ఆ పిల్లాడి పేరు కార్లోస్‌ అల్కరస్‌. టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌లో ఈ టీనేజర్‌ ఇప్పుడు నయా సంచలనం. అగ్రశ్రేణి ఆటగాళ్లకు షాక్‌లిస్తూ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మా ఆదేశాలను అర్థం చేసుకోలేని పెద్దమనిషి ఎవరు?

సుప్రీంకోర్టు జారీచేసిన బెయిల్‌ ఉత్తర్వులను సరిగా అర్థం చేసుకోకుండా, జైల్లో ఉన్న ఖైదీని విడుదల చేయడంలో జాప్యం చేసిన నెల్లూరు జిల్లాలోని ఓ అదనపు సెషన్స్‌ జడ్జిపై సుప్రీంకోర్టు మండిపడింది. తమ ఉత్తర్వులను అలా అర్థం చేసుకోవడాన్ని బట్టిచూస్తే సదరు న్యాయాధికారికి జ్యుడిషియల్‌ అకాడమీలో ఎలాంటి శిక్షణ ఇచ్చారో అర్థం కావడంలేదన్నారు. ఆ పెద్దమనిషి ఎవరన్నది తాము తెలుసుకోవాలనుకుంటున్నామని జస్టిస్‌ యు.యు.లలిత్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Regularisation: క్రమబద్ధకీకరణ!

4. టన్ను ఉక్కు ధర రూ.60,000కు తగ్గొచ్చు: క్రిసిల్‌

ఉక్కు ధరలు వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.60,000కి దిగి రావొచ్చని క్రిసిల్‌ అంచనా వేసింది. గత నెలలో టన్ను ఉక్కు ధర గరిష్ఠంగా రూ.76,000కు చేరిన సంగతి తెలిసిందే. కొవిడ్‌ పరిణామాల కారణంగా ఏర్పడిన సరఫరా అంతరాయాలు కొనసాగుతుండటం, రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం, కర్బన ఉద్గారాలు తగ్గించుకునేందుకు వివిధ దేశాలు చేపట్టిన చర్యల కారణంగా, ఉక్కు తయారీకి వినియోగించే ముడి పదార్థాల ధరలు పెరిగాయని క్రిసిల్‌ పేర్కొంది. ఫలితంగా ఉక్కు ధరలు దూసుకెళ్లాయని విశ్లేషించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చనిపోయినవారికి యూఎల్సీ వర్తించదు

మరణించిన వ్యక్తులకు వ్యతిరేకంగా పట్టణ భూగరిష్ఠ పరిమితి (అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌-యూఎల్సీ) చట్టం కింద ప్రొసీడింగ్స్‌ జారీ చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం పుప్పాలగూడలో సర్వే నం.340లోని 36,623 చదరపు మీటర్లకు, సర్వే నం.340, 341లలోని 62,636 చదరపు మీటర్లకు యూఎల్సీ ప్రొసీడింగ్స్‌ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ కొందరు పిటిషన్లు దాఖలు చేయగా సింగిల్‌ జడ్జి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎవరు ఎవరిని సీఎం చేస్తారు?

‘చంద్రబాబు త్యాగం చేస్తానంటున్నారంటే పవన్‌ కల్యాణ్‌ను సీఎంను చేస్తారా? లేదా పవన్‌ చంద్రబాబును సీఎంను చేస్తారా? వీళ్లందరినీ మోయం అని అంటున్న సోము వీర్రాజు (భాజపా రాష్ట్ర అధ్యక్షుడు) ఏం చెబుతారో...’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు ఓ వైపు త్యాగం చేస్తానంటారు. మరోవైపు తానే లీడ్‌ చేస్తానంటారు. ఇంకోవైపు నేనే సీఎం అని పవన్‌ అంటున్నారు. ఇద్దరు సీఎంలు ఎలా ఉంటారో మరి...’ అని ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘అసని’ అలజడి!

బంగాళాఖాతంలో ‘అసని’ తుపాను కారణంగా తీవ్ర గాలులు వీయడంతో కోస్తా తీరం అల్లకల్లోలంగా మారింది. సోమవారం ఉదయం నుంచే విశాఖ తీరంలో అలలు ఎగిసిపడ్డాయి. రుషికొండ, సాగర్‌నగర్‌ ప్రాంతాల్లో సముద్రం కొంత ముందుకు వచ్చింది. గాలుల తీవ్రతకు కొన్నిచోట్ల 15-20 అడుగుల వరకు అలలు ఎగిసిపడ్డాయి. సముద్రంలో సుడులు తిరుగుతుండటంతో పర్యాటకులను తీరంలోకి అనుమతించలేదు. హార్బరు, రుషికొండ వద్ద పర్యాటకశాఖ నడిపే విహార బోట్లను నిలిపేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఇంత దారుణమా!

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పుల విషయంలో వివక్షాపూరితంగా వ్యవహరించడం సరికాదని తీవ్ర అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర ఆర్థిక వనరులను దెబ్బతీసేలా కేంద్ర చర్యలు ఉన్నాయని ఆక్షేపించింది. కేంద్ర ఆర్థికశాఖ రాష్ట్రాలతో సోమవారం నిర్వహించిన కీలక సమావేశం ఇందుకు వేదికైంది. బడ్జెట్‌ వెలుపల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలను బడ్జెట్‌ పరిధిలోని రుణాలుగానే పరిగణిస్తామని కేంద్రం చెప్పడం పూర్తి కక్షసాధింపు చర్య అని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అడిగినంత అప్పు పుట్టలేదు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.28వేల కోట్ల రుణం తీసుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. దాదాపు నెల రోజులకుపైగా కేంద్రానికి, రాష్ట్రానికీ మధ్య సాగుతున్న ఉత్తర ప్రత్యుత్తరాల నేపథ్యంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ మేరకు అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. కేంద్ర ఆర్థికశాఖ అధికారులు సోమవారం అన్ని రాష్ట్రాల ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఒంట్లో తోడేలు!

‘లూపస్‌ గురించి తెలుసుకుంటే వైద్యశాస్త్రాన్ని తెలుసుకున్నట్టే’. వైద్య విద్యార్థులకు చెప్పే మాట ఇది. మన రోగనిరోధకశక్తి మన మీదే దాడి చేసే తీరుకు లూపస్‌ నిలువెత్తు దర్పణం. ఇది ఏదో ఒక్క భాగానికి పరిమితమయ్యేది కాదు. చర్మం దగ్గర్నుంచి గుండె, కిడ్నీల వంటి కీలక అవయవాల వరకూ అన్నింటి మీదా విరుచుకుపడుతుంది. ఎంత తీవ్రమైనదైనా లూపస్‌ను పూర్తిగా అదుపులో ఉంచుకునే వీలుండటం, లూపస్‌తో తలెత్తే సమస్యలను వెనక్కి మళ్లించుకునే అవకాశం ఉండటం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona Virus: నోటి ద్వారా తీసుకునే టీకాతో కరోనా వ్యాప్తికి కళ్లెం!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని