Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 14 Aug 2022 09:08 IST

1. పులొచ్చింది మామో..!

చెన్నూరు అటవీ సబ్‌ డివిజన్‌ పరిధిలోని కోటపల్లి అడవుల్లో కొత్త పులి రాకతో మళ్లీ అలజడి మొదలైంది. పశువులను హతమారుస్తూ హల్‌చల్‌ చేస్తుండటంతో సమీప గ్రామాల ప్రజల్లో మరోసారి భయం పట్టుకుంది. గత ఏడు సంవత్సరాలుగా మహారాష్ట్రలోని తడోబా అడవుల నుంచి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మీదుగా ఈ ప్రాంతానికి రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో కోటపల్లి మండలం పిన్నారం అడవుల్లో 2016లో వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి ఓ పెద్దపులి మృత్యువాత పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల ప్రకటన ఎప్పుడో?

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలలో 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రకటన కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై కులపతి ఆచార్య కె.చెంచురెడ్డి మాట్లాడుతూ ‘త్వరలోనే ప్రవేశాల ప్రకటన జారీ చేస్తాం. 2008, 2009, 2010లలో రాష్ట్రంలోని ప్రతి మండలం నుంచి పదోతరగతి టాపర్లతో సంబంధం లేకుండా కనీసం ఒక్క విద్యార్థికైనా సీట్లు ఇచ్చాం. ఈ విషయమై కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టులను ఆశ్రయించడంతో పక్కన పెట్టాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

స్వాతంత్ర్యానికి ముందే... రయ్‌ రయ్‌

3. రాత్రికి రాత్రే చెరువుగా

ఇళ్లులేని పేదలకు జగనన్న కాలనీల్లో ఇంటి స్థలాలు కేటాయిస్తున్నారు. ఇందుకు అవసరమైన ప్రభుత్వ భూమి లేని గ్రామాల్లో రూ.కోట్లు పెట్టి ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. కానీ రూ కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడంలో మాత్రం అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఇదే అదునుగా కొందరు అక్రమార్కులు ప్రజావసరాలకు ఉపయోగపడే స్థలాలను దర్జాగా కజ్జా చేసేస్తున్నారు. ఇటువంటి సంఘటనే మండలంలోని ఆలపాడు పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అజ్ఞాత సమర యోధుడు కోరుకొండ

కొండరెడ్డి తెగ గిరిజనుడైన కోరుకొండ సుబ్బారెడ్డి అజ్ఞాత స్వాతంత్య్ర సమరయోధుడు. బ్రిటిష్‌ పాలకుల నుంచి గిరిజనులను వెట్టిచాకిరీ నుంచి విముక్తులను చేసేందుకు పోరాడి ప్రాణత్యాగం చేశారు. బ్రిటిష్‌ పాలకులకు ఎదురు తిరగడంతో ఆయన్ను  ఉరి తీశారు. కోరుకొండ సుబ్బారెడ్డి పేరు చెబితే బ్రిటిషు పాలకులకు సింహ స్వప్నం. ఏడాది కాలం ఆయన చేసిన పోరాటంతో.. ఆయన్ని పట్టుకోవడానికి వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బ్రిటిషు ప్రభుత్వంపై ద్వేషంతో రగిలిపోయేవారు. భారత మాతను దాస్య శృంఖలాల నుంచి విముక్తి కల్పించేందుకు అవిశ్రాంత పోరాటం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మరో ఝాన్సీ.. మన గున్నమ్మ

5. ఇంటర్‌ ఉంటేనే అంగన్‌వాడీ పోస్టు

కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్‌, వర్కర్‌ పోస్టులకు విద్యార్హతను పెంచింది. ఇప్పటివరకు పదోతరగతి అర్హతగా ఈ పార్ట్‌టైమ్‌ నియామకాలు చేపడుతుండగా, ఇకపై కనీసం ఇంటర్మీడియట్‌ అర్హతగా నిర్ణయించింది. ఈమేరకు ‘మిషన్‌ సాక్షం అంగన్‌వాడీ, పోషణ్‌ అభియాన్‌ 2.0’ విధివిధానాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఏటా 40వేల చొప్పున అయిదేళ్లలో 2 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునికీకరించనుంది. అలాగే అంగన్‌వాడీ నియామకాల్లో కనీస వయసు 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించడంతో పాటు గరిష్ఠ వయసు 35 ఏళ్లుగా ఖరారు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నేటి నుంచి ‘అగ్నివీర్‌’ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

ఈనెల 14 నుంచి 31 వరకు జరిగే ‘అగ్నివీర్‌’ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో భాగంగా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందిరాప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియంలో జరిగే ఈ ఎంపికల్లో నిత్యం సుమారు 3వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉండటంతో స్టేడియంకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ పరంగా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* 23న విద్యా సంస్థల బంద్‌

7. రేషన్‌ సరకుల్లో కోత

నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన రేషన్‌ పంపిణీ విధానం అమల్లో అభాసుపాలవుతోంది. సరకుల పంపిణీ విధానం చూస్తుంటే ప్రభుత్వం దృష్టిలో రేషన్‌ అంటే కేవలం బియ్యం ఒక్కటే అన్న నిర్ణయానికి వచ్చినట్లుంది. గతంలో చౌక దుకాణాల ద్వారా వేర్వేరు సరకులను పేదలకు పంపిణీ చేసేవారు. ప్రస్తుతం బియ్యం పంపిణీకే పౌరసరఫరాల విభాగం పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆగస్టు కోటా కింద కార్డుదారులకు బియ్యం, పంచదార, కందిపప్పు ఇవ్వాల్సి ఉండగా బియ్యం మాత్రమే ఇస్తున్నారని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. టోల్‌ గేటు నిర్వహణపై మాజీ మంత్రి ఆగ్రహం
 ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం గ్రామంలో పంచాయతీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న టోల్‌ గేటు నిర్వహణపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె అహోబిలం గ్రామానికి వెళ్లగా టోల్‌ గేటు నిర్వాహకులు ఆమె కారుకు రుసుము వసూలు చేశారు. నిబంధనల ప్రకారం పంచాయతీ అధికారులు నిర్ణయించిన ధర కాకుండా అధికంగా రూ.150 వసూలు చేశారు. అధిక ధరతో ఉన్న గేటు రసీదును తీసుకున్న ఆమె అక్కడే పంచాయతీ అధికారులతో చరవాణిలో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

16న ముఖ్యమంత్రి పర్యటన ఇలా..

9. లోతట్టున కలవరం

లంక గ్రామాలను.. లోతట్టు ప్రాంతాలను జల గండం వీడలేదు. గోదావరి నీటిమట్టం 15 అడుగులు దాటిన తర్వాత కాస్త తగ్గుముఖం పట్టి నిలకడగా ఉంది. ఎగువన వర్షాలు, వరదలు తగ్గడంతో పరిస్థితి కుదుటపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే లంక భూములు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం..కోనసీమ ప్రాంతంలో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించడంతో ప్రజలకు అవస్థలు తప్పడంలేదు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఎడతెగని నిరీక్షణ
రైళ్లు ఎక్కేందుకు లక్షల మంది ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ శాఖ మాత్రం అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతోంది. వెయిటింగ్‌ లిస్టుకు అనుగుణంగా అదనపు రైళ్లు, బోగీలు ఏర్పాటుచేయకుండా ప్రయాణ సమయం వరకు ఊరిస్తూ ఆఖర్లో ఉసూరుమనిపిస్తోంది. ఫలితంగా రద్దయిన టికెట్లతో రైల్లో ఎక్కలేక, అప్పటికప్పుడు ఇతర ప్రత్యామ్నాయాల్ని అందిపుచ్చుకోలేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. సాధ్యాసాధ్యాలతో నిమిత్తం లేకుండా వందల సంఖ్యలో వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లను జారీచేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బంగారం ధర నిర్ణయించే శక్తిగా భారత్‌?

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని