Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 19 Mar 2024 21:02 IST

1. కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన

తెదేపా, భాజపాతో పొత్తులో భాగంగా జనసేనకు రెండు పార్లమెంట్‌, 21 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకినాడ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ నేతలతో పవన్‌ సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన.. వైకాపా ఎమ్మెల్యేకు షోకాజ్‌ నోటీసు

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన పలమనేరు వైకాపా ఎమ్మెల్యే వెంకట గౌడపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలంటూ అధికారులు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. పదో తరగతి పిల్లలకు పలమనేరు ఎమ్మెల్యే.. సోమవారం పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ప్రణీత్‌రావుకు సహకరించింది ఎవరు?

ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. ఏడు రోజుల కస్టడీలో భాగంగా మూడో రోజు ప్రణీత్‌ను విచారిస్తున్న పోలీసులు కీలక సమాచారం సేకరించారు. ఎస్‌ఐబీలో అతనితో పాటు పనిచేసిన ఇన్‌స్పెక్టర్‌ స్థాయి నుంచి కానిస్టేబుల్‌ స్థాయి అధికారులను విచారించి, వాంగ్మూలం నమోదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘సివిల్స్‌’ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా.. కొత్త డేట్‌ ఇదే..

అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష, ఫారెస్ట్‌ సర్వీస్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. నోటిఫికేషన్ల ప్రకారం.. ప్రిలిమినరీ పరీక్ష మే 26న జరగాల్సి ఉంది. అయితే, లోక్‌సభ ఎన్నికల కారణంగా పరీక్షలను జూన్‌ 16న ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అదే ఎన్నికల గుర్తు వాడుకోండి.. శరద్‌ పవార్‌ వర్గానికి ‘సుప్రీం’ అనుమతి

లోక్‌సభ ఎన్నికల వేళ శరద్‌ పవార్‌ వర్గం పార్టీ పేరు, ఎన్నికల చిహ్నం విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఎన్సీపీ- శరద్‌చంద్ర పవార్‌’ అనే పార్టీ పేరును, ‘బాకా ఊదుతోన్న వ్యక్తి’ గుర్తును ఉపయోగించుకునేందుకు అనుమతించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6.ఎన్నికల్లో ఏఐ నకిలీ సమాచార కట్టడి.. మెటా ప్రత్యేక చర్యలు

ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పార్టీలన్నీ సోషల్‌ మీడియా ప్రచారంపైనే ఎక్కువగా దృష్టి సారించాయి. దీంతో ఏఐతో సృష్టించిన నకిలీ, అసత్య సమాచారం ఎక్కువ ప్రచారంలో ఉండే ప్రమాదముంది. దీన్ని కట్టడి చేసేందుకు సోషల్‌ మీడియా దిగ్గజం మెటా ‘ఎలక్షన్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌’ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. జొమాటో కొత్త సేవలు.. వెజిటేరియన్స్‌కు ఇక ప్రత్యేకంగా

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ కంపెనీ జొమాటో కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టింది. శాకాహారుల కోసం ‘ప్యూర్‌ వెజ్‌ మోడ్‌’ను తీసుకొచ్చింది. ఈ ఆహారాన్ని డెలివరీ చేసేందుకు ప్రత్యేకంగా డెలివరీ ఏజెంట్లను ఏర్పాటుచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఐపీఎల్‌లో ఒక్క రోజు కామెంట్రీకి రూ.25 లక్షలు

భారత మాజీ ఆటగాడు నవ్‌జ్యోత్‌ సింగ్‌ దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత కామెంటరీ చేయబోతున్నాడు. ఐపీఎల్‌ 2024 సీజన్‌తో వ్యాఖ్యాతగా సిద్ధు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ వెల్లడించింది. సిద్ధు కామెంటరీ ప్రత్యేకంగా ఉంటుంది. కామెంటరీ బాక్స్‌లో తనదైన శైలిలో పంచ్‌లు, ప్రాసలు, ఛలోక్తులతో నవ్వులు పూయిస్తాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఒలింపిక్‌ విలేజ్‌లో 3లక్షల కండోమ్‌లు..!

పారిస్‌ ఒలింపిక్స్‌కుముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ దేశాలకు చెందిన దాదాపు 14,250 మంది క్రీడాకారుల కోసం ‘ఒలింపిక్‌ విలేజ్‌’లో అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ‘సాన్నిహిత్యం’పై నిషేధం ఎత్తివేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడ బస చేసే క్రీడాకారుల కోసం దాదాపు 3లక్షల కండోమ్‌లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. యుద్ధ తంత్రంగా ఆకలి మంటలు: ఐరాస ఆందోళన

యుద్ధంతో ఛిద్రమవుతోన్న గాజాలో మానవతాసాయం అందించేలా చూసేందుకు ఇజ్రాయెల్ ఆంక్షలు అడ్డంకిగా మారాయని ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు చూస్తుంటే.. ఆకలి మంటల్ని ఆ దేశం యుద్ధతంత్రంగా వాడుతున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని