Kaleshwaram Project: కాళేశ్వరంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు ప్రాంతాల్లో విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 

Updated : 09 Jan 2024 17:33 IST

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన వ్యవహారంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఎర్రమంజిల్‌ జలసౌధలోని కాళేశ్వరం కార్పొరేషన్‌ కార్యాలయంలో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్‌లోని సాగునీటి డివిజన్‌ కార్యాలయాల్లో మేడిగడ్డ, కన్నెపల్లి పంప్‌హౌస్‌కు సంబంధించిన దస్త్రాలను, కరీంనగర్‌ ఎల్‌ఎండీలోని ఇరిగేషన్‌ కార్యాలయంలో కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్ట్‌కు సంబంధించిన దస్త్రాలను పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీల్లో 10 ఇంజినీరింగ్‌, విజిలెన్స్‌ బృందాలు పాల్గొన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని