Bhupesh Baghel: కొరడా దెబ్బలు తిన్న సీఎం.. ఎక్కడంటే..!

ఈ చిత్రంలో కొరడా దెబ్బలు తింటున్న వ్యక్తి ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌. అదేంటీ సీఎం కొరడా దెబ్బలు తినడం ఏంటీ? అయినా ముఖ్యమంత్రిని కొట్టే ధైర్యం

Published : 05 Nov 2021 14:36 IST

దుర్గ్‌: ఈ చిత్రంలో కొరడా దెబ్బలు తింటున్న వ్యక్తి ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌. అదేంటీ సీఎం కొరడా దెబ్బలు తినడం ఏంటీ? అయినా ముఖ్యమంత్రిని కొట్టే ధైర్యం ఎవరికుంది? అనుకుంటున్నారా..! అయితే ఇదంతా ఓ ఆచారం ప్రకారం జరిగింది.  

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో దీపావళి మరుసటి రోజు గోవర్ధన్‌ పూజ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా దుర్గ్‌ జిల్లాలోని జజన్‌గిరి గ్రామంలో ఓ వింత ఆచారాన్ని పాటిస్తారు. పండగ రోజున గోవర్ధన పూజలో పాల్గొని కొరడా దెబ్బలు తింటే అన్ని విఘ్నాలు తొలగిపోయి శుభం కలుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్ కూడా నేడు జజన్‌గిరి గ్రామానికి వెళ్లి ఈ పూజలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కొరడా దెబ్బలు తిన్నారు. బీరేంద్ర ఠాకూర్‌ అనే వ్యక్తి సీఎం చేతిపై ఎనిమిది సార్లు కొరడాతో కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎం తన ట్విటర్ ఖాతాలో షేర్‌ చేశారు. రాష్ట్ర ప్రజల క్షేమం కోసం కొరడా దెబ్బల సంప్రదాయంలో పాల్గొన్నానని, విఘ్నాలు తొలగి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు సీఎం రాసుకొచ్చారు.

గోవర్ధన పూజ రోజున గోమాతకు పూజలు చేస్తుంటారు. గోవులు ఎంత సుభిక్షంగా ఉంటే రాష్ట్రం అంత సమృద్ధిగా ఉంటుందని సీఎం ఈ సందర్భంగా తెలిపారు. కాగా.. భూపేశ్‌ భగేల్‌ గతేడాది కూడా ఈ పూజలో పాల్గొని కొరడా దెబ్బలు తిన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు