భారత్‌: 40వేలకు చేరువలో కరోనా మరణాలు!

భారత్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం 50వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్‌ మరణాలు కూడా రికార్డుస్థాయిలో చోటుచేసుకుంటున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 857 మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు.

Updated : 05 Aug 2020 10:33 IST

24గంటల్లో 52,509 కేసులు, 857 మంది మృత్యువాత!
రోజువారీ మరణాలు భారత్‌లోనే ఎక్కువ

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం 50వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్‌ మరణాలు కూడా రికార్డుస్థాయిలో చోటుచేసుకుంటున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 857 మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 39,795కు చేరింది. రోజువారీగా చూస్తే, 24గంటల వ్యవధిలో ప్రపంచంలో అత్యధిక మరణాలు భారత్‌లోనే చోటుచేసుకున్నాయి. నిన్న ఒకేరోజు కొత్తగా మరో 52,509 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 50వేలకుపైగా కేసులు నమోదుకావడం ఇది వరుసగా ఏడోరోజు కావడం ఆందోళన కలిగించే విషయం. దీంతో బుధవారం నాటికి దేశంలో కొవిడ్‌ బాధితుల సంఖ్య 19,08,254గా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 12లక్షల 82వేల మంది కోలుకోగా మరో 5లక్షల 86వేల క్రియాశీల కేసులు ఉన్నాయి.

67శాతం దాటిన రికవరీ రేటు..
దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారిసంఖ్య పెరగడం ఊరట కలిగించే విషయం. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 51వేల మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 67.19శాతానికి పెరిగింది. అయితే, మరణాల సంఖ్య మాత్రం కలవరపెడుతోంది. నిత్యం 800లకు పైగా కొవిడ్‌ రోగులు మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 2.09శాతంగా ఉంది. ఇక మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కొవిడ్‌ మృతుల సంఖ్య 16 వేలు దాటింది. నిత్యం అక్కడ దాదాపు 300మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. తమిళనాడు, దిల్లీ, గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కరోనా మరణాల సంఖ్య అధికంగా ఉంది.

ఇక ప్రపంచంలో అత్యధిక కొవిడ్‌ కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్‌ మూడోస్థానంలో ఉంది. మరణాల్లో ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతున్నప్పటికీ మరణాల సంఖ్య 40వేలకు చేరువయ్యింది.

ఇవీ చదవండి..
ఫ్లూ కంటే కొవిడ్‌లో మ్యూటేషన్లు తక్కువే..! 
గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని