CBSE ‘పది’ ఫలితాలు ఎప్పుడంటే?

పదో తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు సీబీఎస్‌ఈ బోర్డు కసరత్తు చేస్తోంది. జులై 20 నాటికల్లా వెల్లడించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే రద్దయిన 12వ తరగతి పరీక్షల తుది ఫలితాల వెల్లడికి అనుసరించే మూల్యాంకన విధానాన్ని సుప్రీంకోర్టుకు సీబీఎస్‌ఈ బోర్డు సమర్పించిన విషయం తెలిసిందే.

Updated : 12 Sep 2022 11:15 IST

దిల్లీ:  పదో తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు సీబీఎస్‌ఈ బోర్డు కసరత్తు చేస్తోంది. జులై 20 నాటికల్లా వెల్లడించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే రద్దయిన 12వ తరగతి పరీక్షల తుది ఫలితాల వెల్లడికి అనుసరించే మూల్యాంకన విధానాన్ని సుప్రీంకోర్టుకు సీబీఎస్‌ఈ బోర్డు సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్‌ సన్యం భరద్వాజ్‌ మాట్లాడుతూ.. జులై 20కి పదో తరగతి పరీక్షల ఫలితాలు, జులై 31 నాటికి 12వ తరగతి ఫలితాలను వెల్లడించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అందువల్ల చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకొంటున్న విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 

‘‘వీలైనంత త్వరలో సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఫలితంతో ఏ విద్యార్థి అయినా సంతృప్తి చెందకపోతే, అలాంటివారు పరీక్ష రాసేందుకు వీలుగా రిజిస్ట్రేషన్‌ను త్వరలోనే ప్రారంభిస్తాం. సమయానుకూలంగా పరీక్ష కేంద్రాలను కేటాయిస్తాం. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగానే ఎగ్జామ్స్‌ నిర్వహించేందుకు ప్రయత్నిస్తాం’’ అని తెలిపారు. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల ఫలితాలను ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా ఆధారంగా ప్రకటించనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను cbse.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. గతేడాది జులై 15న ఫలితాలు విడుదల చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని