Israel-Hamas: ముడి చమురు దిగుమతికి ఇబ్బందేం లేదు: హర్‌దీప్‌సింగ్ పూరీ

ఇజ్రాయెల్-హమాస్‌ దాడుల ప్రభావం భారత్‌కు ముడిసరకు సరఫరాపై ఉండబోదని కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ అన్నారు.

Published : 13 Oct 2023 20:51 IST

చండీగఢ్‌: ఇజ్రాయెల్‌- హమాస్‌ (Israel-Hamas) పరస్పర దాడుల ప్రభావం భారత్‌కు ముడిచమురు (crude oil) సరఫరాపై ఏమాత్రం ఉండబోదని కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ (Hardeep singh Puri) స్పష్టం చేశారు. ఒకవేళ ఇజ్రాయెల్‌ దాడులు ఉద్ధృతం చేసినా ముడిచమురు దిగుమతికి ఎలాంటి ఆటంకం ఉండబోదని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. చండీగఢ్‌లోని గురు గోవింద్‌ సింగ్‌ కళాశాల యూత్‌ ఫెస్టివల్‌లో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా గతంలో 27 దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకున్నట్లు గుర్తు చేసిన ఆయన.. ప్రస్తుతం ఆ సంఖ్య 39కి చేరిందన్నారు. మన దేశంలో రోజుకు 5 మిలియన్‌ బ్యారెళ్ల చమురును వినియోగిస్తున్నట్లు తెలిపారు. తాజాగా అమెరికా నుంచి దిగుమతులు పెరిగాయని, 20 బిలియన్‌ డాలర్ల విలువైన ఇంధనాన్ని అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. పండగ సీజన్‌లో ఇంధన ధరలు తగ్గొచ్చా.. అని విలేకరులు ప్రశ్నించగా.. ప్రపంచవ్యాప్తంగా గత రెండేళల్లో చమురు ధరలు అమాంతం పెరగ్గా.. భారత్‌లో మాత్రం 5 శాతం తగ్గాయని గుర్తు చేశారు. ఇంధన ధరలు పెరిగాయంటూ విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్న ఆయన.. వాటి ధరలను ఏదో ఒక ప్రాతిపదికన నిర్ణయించలేమని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని