AAP vs BJP: అవినీతితో ఊపిరాడలేదు.. అందుకే ఆప్‌ను వీడా..!
దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు కొత్త మేయర్ వచ్చిన రెండు రోజుల వ్యవధిలోనే ఆప్(AAP)కు షాక్ తగిలింది. ఒక కౌన్సిలర్ భాజపాలో చేరారు.
దిల్లీ: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు(MCD Elections) మొదలైన దగ్గరి నుంచి రోజుకో కొత్త పరిణామం చోటుచేసుకుంటోంది. దిల్లీ మేయర్ ఎన్నికపై రగడ ముగిసి.. ఎట్టకేలకు కొత్త మేయర్ వచ్చారు. బుధవారం స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక కోసం జరిగిన ఎంసీడీ సమావేశం.. రణక్షేత్రంగా మారింది. ఇది జరిగిన గంటల వ్యవధిలో ఓ కౌన్సిలర్ ఆప్‌ను వీడి భాజపాలో చేరారు.
బవానాకు చెందిన కౌన్సిలర్ పవన్ షెహ్రావత్(Pawan Sehrawat) ఆప్‌ను వీడుతూ విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలోని అవినీతితో ఊపిరాడలేదని ఆరోపించారు. అలాగే ఎంసీడీ కార్యాలయంలో రచ్చ చేయాలని కౌన్సిలర్లకు సూచనలు వచ్చాయని, దానిపై తాను తీవ్ర ఆవేదనకు గురైనట్లు వెల్లడించారు. తాజాగా ఆయన దిల్లీలో భాజపాలో చేరారు.
ఇదిలా ఉంటే.. స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక కోసం బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు జరిగిన ఎంసీడీ(MCD) సమావేశం కురుక్షేత్రాన్ని తలపించింది. బ్యాలెట్ బాక్సులు, బాటిళ్లు ఎగిరిపడ్డాయి. కౌన్సిలర్లు పరస్పరం నెట్టుకున్నారు. చేతులతో కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. దాంతో ఆ రోజు ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయి.. శుక్రవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్‌పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్‌లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.