గూగుల్‌ మ్యాప్స్‌లో ‘కశ్మీర్‌’ వివాదం

దేశాల సరిహద్దులకు సంబంధించి గూగుల్‌ మ్యాప్స్‌ కొత్తగా తీసుకొచ్చిన మార్పులు వివాదాస్పదంగా మారాయి. కశ్మీర్‌ సరిహద్దు విషయంలోనూ...

Published : 16 Feb 2020 16:37 IST

హైదరాబాద్‌‌: దేశాల సరిహద్దులకు సంబంధించి గూగుల్‌ మ్యాప్స్‌ కొత్తగా తీసుకొచ్చిన మార్పులు వివాదాస్పదంగా మారాయి. కశ్మీర్‌ సరిహద్దు విషయంలోనూ ఆ మార్పులు కనిపించాయి. మన దేశం నుంచి చూసినప్పుడు భారత్‌లో కశ్మీర్‌ అంతర్భాగంగానే కనిపించినా.. పాక్‌ నుంచి చూసినప్పుడు మాత్రం వివాదాస్పద సరిహద్దును సూచించే డాట్ లైన్‌తో సూచిస్తోంది. కొత్తగా తీసుకొచ్చిన మార్పులపై గూగుల్‌ స్పందించింది. స్థానిక చట్టాల ప్రకారమే మ్యాప్స్‌ను రూపొందించినట్లు సంస్థ అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. వివాదాస్పద ప్రాంతాలను న్యాయంగా చూపెట్టేందుకు గూగుల్‌ ప్రపంచ విధానాన్ని అనుసరిస్తోందని.. ప్రపంచ వేదికలపై ఆయా దేశాలు ప్రకటించుకునే అంశాలనే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు గూగుల్‌ స్పష్టం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని