నిసర్గ తుపాను: రన్‌వేపై జారిన విమానం

బెంగళూరు నుంచి ముంబయి చేరుకున్న ఫెడ్‌ఎక్స్‌కు చెందిన సరకు రవాణా విమానం ఒకటి ముంబయి విమానాశ్రయంలో రన్‌వేపై జారింది. నిసర్గ తుపాను......

Updated : 08 Dec 2022 16:07 IST

ముంబయి: బెంగళూరు నుంచి ముంబయి చేరుకున్న ఫెడ్‌ఎక్స్‌కు చెందిన సరకు రవాణా విమానం ఒకటి ముంబయి విమానాశ్రయంలో రన్‌వేపై జారింది. నిసర్గ తుపాను కారణంగా వీచిన గాలులు, వర్షం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ప్రమాదం వల్ల ఇతర విమాన కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకగం కలగలేదని ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. ఈ ఘటన నేపథ్యంలో రాత్రి 7 గంటల వరకు విమానాశ్రయంలో రాకపోకలు నిషేధించినట్లు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు వెల్లడించారు.

మరోవైపు నిసర్గ తుపాను మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మహారాష్ట్ర తీర ప్రాంతం రాయ్‌గఢ్‌‌ జిల్లా ఆలీబాగ్‌ వద్ద తీరం దాటింది. అయితే, ఈ తుపాను నుంచి ముంబయి తప్పించుకుంది. తీరం దాటినప్పుడు తుపాను బలహీన పడడంతో ముంబయి మరో ముప్పు నుంచి బయటపడింది. తీర ప్రాంత జిల్లా రాయ్‌గఢ్‌ జిల్లాపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో పలు చోట్ల చెట్లు నేల కూలాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు