భార‌త్: 17వేల‌కు చేరువ‌లో క‌రోనా మ‌ర‌ణాలు!

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం సృష్టిస్తోంది. గ‌త కొన్ని రోజులుగా భార‌త్ లో నిత్యం దాదాపు 19వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 18,522 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

Updated : 30 Jun 2020 09:55 IST

24గంట‌ల్లో 18,522 కేసులు, 418మ‌ర‌ణాలు!

దిల్లీ: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం సృష్టిస్తోంది. గ‌త కొన్నిరోజులుగా భార‌త్‌లో నిత్యం దాదాపు 19వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 18,522 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మంగ‌ళ‌వారం నాటికి దేశంలో మొత్తం కొవిడ్‌ బాధితుల‌ సంఖ్య 5,66,840కి చేరింది. వీరిలో ఇప్ప‌టివ‌ర‌కు 16,893మంది మృత్యువాత‌ప‌డ్డ‌ట్లు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్ల‌డించింది. మొత్తం బాధితుల్లో ఇప్ప‌టివ‌ర‌కు 3,34,821మంది కోలుకోగా మ‌రో 2,15,125 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు తెలి‌పింది. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి కోలుకుంటున్నవారి శాతం 58.6గా ఉంది. ఈ సంద‌ర్భంలో దేశ‌వ్యాప్తంగా కంటెయిన్‌మెంట్ జోన్ల‌లో జులై 31వ‌ర‌కూ లాక్‌డౌన్ కొన‌సాగుతుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

కొవిడ్‌19 తీవ్ర‌త అధికంగా ఉన్న‌ మ‌హారాష్ట్రలో 1,69,883 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా వీరిలో ఇప్ప‌టివ‌ర‌కు 7610మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజ‌ధాని దిల్లీలో కొవిడ్ కేసుల సంఖ్య 85,161కి చేర‌గా 2680మంది చనిపోయారు. త‌మిళ‌నాడు, గుజ‌రాత్‌ల‌లో మ‌ర‌ణాల సంఖ్య క‌ల‌వ‌ర‌పెడుతోంది. గుజ‌రాత్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 1827 మంది క‌రోనా సోకినవారు చ‌నిపోగా, త‌మిళ‌నాడులో ఈ మ‌ర‌ణాల సంఖ్య 1141కి చేరింది. దేశంలో వైర‌స్ తీవ్ర‌త పెరుగుతున్న నేప‌థ్యంలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లను కూడా భారీగా నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్‌లో దాదాపు 84ల‌క్ష‌ల శాంపిళ్లకు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రిపిన‌ట్లు భార‌త వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి వెల్ల‌డించింది.

ఇక ప్ర‌పంచంలో అత్య‌ధికంగా క‌రోనా కేసులు న‌మోదౌతున్న దేశాల జాబితాలో భార‌త్ నాలుగో స్థానంలో కొన‌సాగుతోంది. మ‌ర‌ణాల్లో మాత్రం ఎనిమిదో స్థానంలో ఉంది. ఇదిలాఉంటే, దేశంలో నెల‌కొన్న‌ తాజా ప‌రిస్థితుల‌పై ప్ర‌ధానమంత్రి న‌రేంద్రమోదీ ఈ సాయంత్రం జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని