India Corona : అదుపులోనే కరోనా : వెయ్యిలోపు కేసులు.. 6 మరణాలు..

దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా వెయ్యికి సమీపంలోనే కొత్త కేసులు

Published : 15 Apr 2022 10:09 IST

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో వెయ్యికి సమీపంలోనే కొత్త కేసులు వెలుగులోకి వస్తుండగా.. మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుండటం ఊరట కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

* గడిచిన 24 గంటల్లో 3,67,213 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 949 కేసులు వెలుగులోకి వచ్చాయి.

* ఇక నిన్న కరోనాతో ఆరుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకు మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,21,743కు చేరింది.

* కొత్త కేసుల కంటే రికవరీలు కాస్త తక్కువగా ఉండటం గమనించాల్సిన విషయం. నిన్న 810 మంది కోలుకోగా ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.25 కోట్లు దాటింది. రికవరీ రేటు  98.76 శాతంగా ఉంది.

* ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య స్పల్పంగా పెరిగి 11,191కు చేరింది. ఆ రేటు 0.03%గా ఉంది.

* ఇక టీకా కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న 6,66,660 మందికి టీకాలు వేయగా.. ఇప్పటి 186.30 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

* ఇక దేశ రాజధాని దిల్లీలో కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతకుముందు రోజు అక్కడ 299 కేసులు నమోదు కాగా.. నిన్న 325 కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే అక్కడ తాజాగా మరణాలు నమోదుకాకపోవడం ఊరట కలిగించే విషయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు