అసెంబ్లీలో లంచం డబ్బులు ప్రదర్శించిన ఆప్‌ ఎమ్మెల్యే

దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అక్రమాలను బయటపెట్టకుండా ఉండేలా తనకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మహేందర్‌ గోయల్‌ ఆ డబ్బులను శాసనసభకు తీసుకొచ్చి చూపించారు.

Published : 19 Jan 2023 05:37 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అక్రమాలను బయటపెట్టకుండా ఉండేలా తనకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మహేందర్‌ గోయల్‌ ఆ డబ్బులను శాసనసభకు తీసుకొచ్చి చూపించారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న మహేందర్‌ గోయల్‌ మాట్లాడుతూ.. రోహిణి జిల్లాలోని డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆసుపత్రిలో తాత్కాలిక సిబ్బంది నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ నియామకాల ప్రక్రియను ఓ ప్రైవేటు కాంట్రాక్టరుకు అప్పగించారని, ఆయన  ఉద్యోగుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. దీనిపై తాను డీసీపీ, చీఫ్‌ సెక్రటరీ, లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. దీంతో ఆ కాంట్రాక్టరు తనతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నించి తనకు లంచం ఇచ్చారని ఆరోపించారు. ఆ ‘లంచం’ డబ్బులు ఇవేనంటూ ఓ సంచిలో నుంచి తీసి శాసనసభ సభ్యులకు చూపించారు. ఈ విషయంలో తాను మాట్లాడకుండా ఉండేందుకు కొందరు శక్తిమంతమైన వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని