జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం

భారీ దాడులకు పథకం పన్నిన జైషే మహమ్మద్‌ కుట్రను భద్రతాదళాలు భగ్నం చేశాయి. జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో పోలీసులు, సైన్యం శుక్రవారం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఆరుగురు ఉగ్రవాద సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు.

Published : 04 Feb 2023 04:49 IST

ఆరుగురిని అదుపులోకి తీసుకున్న సైన్యం

శ్రీనగర్‌: భారీ దాడులకు పథకం పన్నిన జైషే మహమ్మద్‌ కుట్రను భద్రతాదళాలు భగ్నం చేశాయి. జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో పోలీసులు, సైన్యం శుక్రవారం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఆరుగురు ఉగ్రవాద సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 446 రౌండ్లకు సరపడా ఎమ్‌4 రైఫిళ్లు, ఎనిమిది మేగజిన్‌లు పిస్టల్‌, తూటాలతో పాటు గ్రనేడ్లు, మోర్టార్‌ షెల్స్‌, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నట్లు సైనికాధికారులు తెలిపారు. సరిహద్దు వెంబడి ఉండే ఉగ్రవాద ముఠా నాయకులతో వీరు సామాజిక మాధ్యమాల ద్వారా అనుసంధానమై ఉన్నట్లు గుర్తించారు. తమ దగ్గరున్న ఆయుధాలతో కుల్గాంలో అరాచకం సృష్టించాలని వారు పథకం పన్నినట్లు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు