West Bengal: అసెంబ్లీలోకి నకిలీ ఎమ్మెల్యే

బడ్జెట్‌ సమావేశాల వేళ అసెంబ్లీలోకి ఓ నకిలీ ఎమ్మెల్యే ప్రవేశించిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపింది.

Updated : 17 Feb 2023 08:12 IST

బడ్జెట్‌ సమావేశాల వేళ అసెంబ్లీలోకి ఓ నకిలీ ఎమ్మెల్యే ప్రవేశించిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపింది. విధానసభ గేటు దాటి ప్రధాన భవనం వద్దకు చేరుకున్న ఆ వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. అతడిని ప్రశ్నించగా.. సహకార శాఖ మంత్రి అరూప్‌రాయ్‌ స్థానంలో తాను అసెంబ్లీకి వచ్చానని పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో అసెంబ్లీ వద్ద భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని