ప్రణాళిక ప్రకారం దేశ సమగ్రతపై దాడి: ధన్‌ఖడ్‌

దేశ సమగ్రతపై ఒక పక్కా ప్రణాళిక ప్రకారం దాడికి ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ చెప్పారు.

Updated : 31 Mar 2023 05:34 IST

దిల్లీ: దేశ సమగ్రతపై ఒక పక్కా ప్రణాళిక ప్రకారం దాడికి ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ చెప్పారు. గోబెల్స్‌ ప్రచారం కూడా చిన్నబోయేలా ఈ దాడి జరుగుతోందన్నారు. ఓ వార్తాసంస్థ ఆధ్వర్యంలో గురువారం జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. అవినీతిపై ప్రభుత్వం చేస్తున్న యుద్ధాన్ని పక్షపాతంతో, స్వీయప్రయోజనాల కోసం అడ్డుకోవడం దురదృష్టకరమని అన్నారు. అవినీతిని రాజకీయ కోణంలో ఎలా చూస్తామని విస్మయం వ్యక్తంచేశారు. కేంద్ర సంస్థలు తమను లక్ష్యంగా చేసుకుంటున్నాయని విపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు