12వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి.. ‘ప్రత్యేక సిక్కు దేశం’ డిమాండ్‌ తొలగింపు

పన్నెండో తరగతి పొలిటికల్‌ సైన్స్‌ పాఠ్యపుస్తకం నుంచి ప్రత్యేక సిక్కు దేశం కావాలన్న ఖలిస్థాన్‌ డిమాండ్‌కు సంబంధించిన అంశాలను నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) తొలగించింది.

Published : 31 May 2023 04:32 IST

దిల్లీ: పన్నెండో తరగతి పొలిటికల్‌ సైన్స్‌ పాఠ్యపుస్తకం నుంచి ప్రత్యేక సిక్కు దేశం కావాలన్న ఖలిస్థాన్‌ డిమాండ్‌కు సంబంధించిన అంశాలను నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) తొలగించింది. ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. 12వ తరగతి పొలిటికల్‌ సైన్స్‌ పాఠ్యపుస్తకంలో సిక్కుల గురించిన చారిత్రక వివరాలను తప్పుగా ప్రచురించారంటూ శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ (ఎస్‌జీపీసీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని ఎన్‌సీఈఆర్‌టీ దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో సదరు పాఠ్యపుస్తకం నుంచి ప్రత్యేక సిక్కు దేశం డిమాండ్‌కు సంబంధించిన అంశాలను తొలగిస్తున్నట్లు ఎన్‌సీఈఆర్‌టీ వర్గాలు వెల్లడించాయి. డిజిటల్‌ పుస్తకాల్లోనే ఈ మార్పు ఉంటుందని, ఇప్పటికే ముద్రితమైన పుస్తకాలు యథాతథంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని