సముద్రంలోకి దూకి ముగ్గురిని రక్షించిన ఎమ్మెల్యే

సముద్రంలో కొట్టుకుపోతున్న యువకులను భాజపా ఎమ్మెల్యే ఒకరు ప్రాణాలకు తెగించి రక్షించారు.

Published : 02 Jun 2023 03:51 IST

సముద్రంలో కొట్టుకుపోతున్న యువకులను భాజపా ఎమ్మెల్యే ఒకరు ప్రాణాలకు తెగించి రక్షించారు. మత్స్యకారుల బోటు సాయంతో యువకులను ఒడ్డుకు చేర్చారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. గుజరాత్‌ అమ్రేలీ జిల్లాలోని తీర ప్రాంతంలో నలుగురు యువకులు స్నానం కోసం సముద్రంలోకి దిగారు. పెద్ద ఎత్తున అలలు రావడంతో వారు సముద్రం లోపలికి కొట్టుకుపోయారు. వారి కేకలు విని స్థానికులు, మత్స్యకారులు గుమికూడారు. అదే సమయంలో బీచ్‌లో ఉన్న రాజులా ఎమ్మెల్యే హీరా సోలంకి విషయం తెలుసుకొని వెంటనే సముద్రంలోకి దూకారు. ఎమ్మెల్యేకు కొందరు మత్స్యకారులు, యువకులు తోడుగా వెళ్లారు. ముగ్గురు యువకులను బోటులో ఒడ్డుకు సురక్షితంగా చేర్చారు. అయితే మరో యువకుడు మాత్రం కనిపించలేదు. ఆ తర్వాత అతడి మృతదేహం లభ్యమైంది. ప్రాణాలకు తెగించి యువకుల ప్రాణాలను రక్షించిన హీరా సోలంకికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు