Rajasthan: దళితుడితో ఎమ్మెల్యే బూట్లు నాకించిన రాజస్థాన్‌ డీఎస్పీ!

రాజస్థాన్‌లో ఓ దళిత వ్యక్తి (51)తో పోలీసు అధికారి అమానవీయంగా ప్రవర్తించినట్లు కేసు నమోదైంది. ఫిర్యాదు ప్రకారం.. బాధితుడిపై మూత్రవిసర్జన చేయడమేగాక, అతడి చేత స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గోపాల్‌ మీణా బూట్లు నాకించారు.

Updated : 12 Aug 2023 08:46 IST

రాజస్థాన్‌లో ఓ దళిత వ్యక్తి (51)తో పోలీసు అధికారి అమానవీయంగా ప్రవర్తించినట్లు కేసు నమోదైంది. ఫిర్యాదు ప్రకారం.. బాధితుడిపై మూత్రవిసర్జన చేయడమేగాక, అతడి చేత స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గోపాల్‌ మీణా బూట్లు నాకించారు. జూన్‌ 30న ఈ ఘటన జరగ్గా.. పోలీసు అధికారి, ఎమ్మెల్యేల భయంతో బాధితుడు వెంటనే ఈ విషయం బయటపెట్టలేదు. చివరకు జులై 27న అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ రోజు.. తన భార్యతో కలిసి పొలంలో పనిచేసుకొంటూ ఉండగా కొందరు పోలీసులు దాడి చేసి ఎమ్మెల్యే ఇంటికి లాక్కెళ్లారని, అక్కడ డీఎస్పీ శివకుమార్‌ తనపై మూత్రవిసర్జన చేసినట్లు బాధితుడు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నాడు. ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఆ పొలంలో ఎలా దిగుతావని పోలీసులు బెదిరించారని ఆరోపించారు. ఫోను కూడా లాగేసుకున్నారని, ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారని బాధితుడు వాపోయాడు. తన ఫిర్యాదును పోలీసులు తొలుత నిరాకరించారని, కోర్టు ఆదేశాల తర్వాతే వారు కేసు నమోదు చేసినట్లు తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు