Asaduddin Owaisi: అసదుద్దీన్‌ సభలో పాక్‌ అనుకూల నినాదాలు.. మజ్లిస్‌ అభ్యర్థిపై కేసు

ఝార్ఖండ్‌లోని డుమరీ శాసనసభ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్న సభలో ఓ వ్యక్తి పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేయడంతో కేసు నమోదైంది.

Updated : 01 Sep 2023 09:56 IST

గిరిడీహ్‌: ఝార్ఖండ్‌లోని డుమరీ శాసనసభ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్న సభలో ఓ వ్యక్తి పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేయడంతో కేసు నమోదైంది. డుమరీ అసెంబ్లీ నియోజకవర్గ మజ్లిస్‌ అభ్యర్థి ఎం.డి.అబ్దుల్‌ మొబిన్‌ రిజ్వితోపాటు నిర్వాహకుడు ముజఫర్‌ హసన్‌ నురానీ, మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు గురువారం పోలీసు అధికారులు వెల్లడించారు. డుమరీ ఎమ్మెల్యే జగర్నాథ్‌ మహతో (జేఎంఎం) మృతి వల్ల ఖాళీ అయిన ఆ స్థానానికి సెప్టెంబరు 5న ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానంలో పోటీకి దిగిన మజ్లిస్‌ అభ్యర్థి అబ్దుల్‌ మొబిన్‌ రిజ్వికి మద్దతుగా బుధవారం ర్యాలీ నిర్వహించారు. అసదుద్దీన్‌ ఒవైసీ ప్రసంగిస్తున్న సమయంలో సభకు హాజరైన ఓ వ్యక్తి పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా, మత సామరస్యానికి భంగం కలిగించేలా ప్రవర్తించినందుకు డుమరీ పోలీసు స్టేషనులో కేసు నమోదు చేసినట్లు గిరిడీహ్‌ జిల్లా అధికారి తెలిపారు. అది ట్యాంపంరింగ్‌ వీడియో అంటూ ఝార్ఖండ్‌ ఎంఐఎం అధ్యక్షుడు ఎం.డి.షాకీర్‌ పోలీసుల తీరును ఖండించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని